AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ తండ్రి తీర్పు.. ప్రియుడితో వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు శాశ్వత శిక్ష! ఏం చేశాడో తెలుసా..

ల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఎదిగాక గుండెలపై తన్నితే కలిగే నొప్పి అంతా ఇంతా కాదు. ఓ కూతురు అదే చేసింది. ఇంట్లో నుంచి ప్రియుడితో వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. దీనిని ఆమె తండ్రి క్షమించలేకపోయాడు. అంతే దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుందనీ..

ఓ తండ్రి తీర్పు.. ప్రియుడితో వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు శాశ్వత శిక్ష! ఏం చేశాడో తెలుసా..
Father Pind Daan To Alive Daughter
Srilakshmi C
|

Updated on: Mar 18, 2025 | 8:48 AM

Share

ఉజ్జయిని, మార్చి 18: కూతురు ప్రియుడితో వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుందనీ.. కూతురు బతికుండగానే ఊరంతా పిలిచి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి పిండం పెట్టాడు ఆ తండ్రి. తమ కూతురు చనిపోయినట్లు ఊరంతా పోస్టర్లు అతికింది నానాహంగామా చేశాడు. అంతేనా కుటుంబ సభ్యులంతా గుండు చేయించుకుని, ఊరంతా శాంతి విందు భోజనాలు కూడా పెట్టాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖచ్రోడ్ ప్రాంతంలోని ఉజ్జయినిలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

ఖచ్రోడ్ తహసీల్‌లోని గుదావన్ గ్రామానికి చెందిన వర్దిరామ్ గర్గమ కుమార్తె మేఘ గర్గమ.. కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు దీపక్‌తో ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకుంది. దీంతో మేఘ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. దీంతో పోలీసులు గాలించి మేఘను, ఆమె ప్రియుడు దీపక్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం మేఘ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. వారు కూడా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు మేఘను తమ కుటుంబాన్ని గుర్తించమని అడిగగా.. కానీ ఆమె వారిని గుర్తించడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన మేఘ తల్లిదండ్రులు తమ కుమార్తె ఈ క్షణం నుంచి చనిపోయినట్లేనని చెప్పారు. అంతటితో ఆగకుండా కుమార్తె మేఘ గోర్ని సంతాప కార్డులను ముద్రించి ఊరంతా పంచిపెట్టారు. ఊరంతా పిలిచి ఆచారాల ప్రకారం పిండ దానాన్ని నిర్వహించడం ద్వారా శాంతి విందును ఏర్పాటు చేశారు.

నేటి సమాజంలోని పిల్లలు ఆధునికతను విధ్వంసానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారని మేఘ తండ్రి తన బాధను సంతాప లేఖలో ముద్రించాడు. ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను దుర్వినియోగం, తల్లిదండ్రుల ప్రేమను బలహీనతగా అర్ధం చేసుకుని, సమాజం – కుటుంబం గౌరవాన్ని పట్టించుకోకుండా పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఇది నేటి కాలంలో ట్రెండ్‌గా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నేటి సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయయని సంతాప లేఖలో మేఘ తండ్రి తెలిపారు. తన కుమార్తె పారిపోయి దీపక్‌ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందని, తమ గౌరవాన్ని లెక్క చేయని కుమార్తె మేఘ 15 మార్చి 2025 శనివారం మరణించిందని సంతాప లేఖలో ముద్రించి బంధుజనాలకు, ఊరి జనాలకు పంచిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?