Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGRJC CET 2025 Notification: గురుకులాల్లో ఇంటర్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశాలకు ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 24 నుంచి ఆర్‌జేసీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు..

TGRJC CET 2025 Notification: గురుకులాల్లో ఇంటర్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశాలకు ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల
RJC CET 2025
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 23, 2025 | 7:10 AM

హైదరాబాద్‌, మార్చి 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 24 నుంచి ఆర్‌జేసీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదవాలనుకునేవారు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందొచ్చు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు 040-24734899 ఫోన్ నంబరుకు పని వేళల్లో ఫోన్ చేసి సమాచారం పొందొచ్చని సంస్థ పేర్కొంది.

ఐటీఐ 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌-2025) ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమాలో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 21 నుంచి ప్రారంభమైనాయి. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మే 20న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణలో రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు అయ్యాయి. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!