RCB vs KKR: నిన్నటి మ్యాచ్‌లో భువీని ఎందుకు ఆడించలేదంటే..? కారణం చెప్పిన ఆర్సీబీ
ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేసినప్పటికీ, తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో అతన్ని ఆడించలేదు. మైనర్ గాయంతో బాధపడుతున్నందున విశ్రాంతి ఇచ్చారు. ఆర్సీబీ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది, జోష్ హెజెల్‌వుడ్, కృణాల్ పాండ్యా విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ తిరిగి రావచ్చు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.10.75 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ స్ట్రాంగ్ అయిందని అంతా అనుకున్నారు. కానీ, తీరా కేకేఆర్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్సీబీ భువీని పక్కనపెట్టింది. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. భువీని కాదని.. వాళ్లు రిటేన్ చేసుకున్న యష్ దయాల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. ఆర్సీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి.. అన్ని కోట్లు పెట్టి తీసుకుంది డగౌట్‌లో కూర్చోబెట్టేందుకా? అంటూ ఆర్సీబీపై మండిపడ్డాడు.
అసలు భువీని ఎందుకు తీసుకోలేందంటూ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఆర్సీబీపై విమర్శల వర్షం కురిసింది. కానీ, కేకేఆర్‌ను బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆర్సీబీ పూర్తిగా డామినేట్ చేసి విజయం సాధించడంతో ఫ్యాన్స్ రిలాక్స్ అయినా.. అందరిలో ఒక డౌట్ ఉంది. అసలు భువీని ఎందుకు ఫస్ట్ మ్యాచ్‌లో ఆడించలేదని? అయితే అందుకు కారణం ఉంది. భువీని ఈ మ్యాచ్‌లో పక్కనపెట్టలేదు. నిజానికి భువీ మైనర్ ఇంజ్యూరీతో బాధపడుతున్నాడు. అందుకే తొలి మ్యాచ్‌లో అతనికి రెస్ట్ ఇచ్చారు. పూర్తిగా కోలుకుంటే.. బహుషా రెండో మ్యాచ్‌లో భువీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. సుయాష్ లేదా దయాల్ స్థానంలో భువీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ప్రత్యర్థి జట్టు, పిచ్‌ని బట్టి మార్పులు ఉండే అవకాశం ఉంది. భువీ లేకపోయినా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ చేశారు. 10 ఓవర్లలో తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 100కి పైగా పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కేకేఆర్‌ను కేవలం 175 పరుగులకే పరిమితం చేశారంటే.. కచ్చితంగా ఆర్సీబీ బౌలర్లను మెచ్చుకొని తీరాల్సిందే. అందులోనా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై ఆర్సీబీ బౌలర్లు సూపర్‌గా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జోష్ హెజల్‌వుడ్, కృనాల్ పాండ్యా మాత్రం ఆర్సీబీకి మ్యాచ్ గెలిపించి పెట్టారని చెప్పాలి.
Captaincy debut – RaPa has already kicked things off on a winning note! 🪙
We’ll be chasing first in the season opener! 🤩
Team News – we go with 2 spinners and 3 pacers. Salt, Liam, Tim and Hazlewood fill the overseas quota! 📰
Unfortunately Bhuvi misses out due to a minor… pic.twitter.com/9QMCK5ezY3
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.