IPL 2025: మరికొన్ని గంటల్లో SRH vs RR..! ఫస్ట్ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా? పిచ్ ఎలా ఉందంటే?
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న IPL 2025 మొదటి మ్యాచ్‌కు సంబంధించిన ప్రివ్యూ ఇది. రెండు జట్ల బలహీనతలు, బలాలను విశ్లేషించి, మ్యాచ్ ఫలితం గురించి ఊహించబడింది. హైదరాబాద్ జట్టు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భద్రతా ఏర్పాట్లు, మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదరుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఉప్పల్ ఊగిపోనుంది..! ఫస్ట్ మ్యాచ్‌తోనే బోణీ కొట్టి.. సీజన్18ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరు? రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా? లేక సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా? ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలుకానున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. స్టార్టింగ్‌లోనే తామెంత డేంజర్‌రో అన్ని జట్లకు తెలిసేలా హోమ్ టౌన్‌లో SRH గ్రాండ్ విక్టరీని నమోదు చేయాలని కోరుతున్నారు.
ఇక మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచ్ జరగనుంది. 2700 మంది పోలీసులతో బందోబస్తు స్టేడియం బయట, లోపల 450 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండనుంది. 39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో… ఎలాంటి తొక్కిసలాటలు జరగనుండా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచారు. ఇక గత సీజన్‌లో సంచలన ప్రదర్శనతో తృటిలో టైటిట్ మిస్ చేసుకున్న హైదరాబాద్.. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలన్న పంతంతో ఈ సీజన్‌కు సిద్ధమైంది.
తొలి గ్రూపు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టి కరిపించేందుకు రెడీ అయిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం కావడంతో… హెడ్, అభిషేక్, క్లాసెన్‌లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇటు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. అయితే ఈ రెండు జట్లలో హైదరాబాద్ జట్టుదే స్వల్ప ఆధిపత్యం.
ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడగా…అందులో ఎస్‌ఆర్‌హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. అలాగే, ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌పై హైదరాబాద్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచింది. ఈ సారి కూడా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మొత్తంగా ఇవాళ్టి ఉప్పల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఉగ్రరూపం చూస్తామంటున్నారు ఫ్యాన్స్. రాజస్థాన్‌ను చిత్తుచేసి బోణీ కొట్టడం ఖాయమంటున్నారు. మరి చూడాలి ఏం జరగబోతోందో!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.