IPL 2025: ఆర్సీబీ గెలిచింది సాల్ట్, కోహ్లీ వల్ల కాదు.. అసలైన హీరో ఇతనే!
ఐపీఎల్ 2023 లోని మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్‌ను ఓడించింది. కేకేఆర్ బలమైన బ్యాటింగ్ లైనప్‌తో 174 పరుగులు చేసింది. కానీ, కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్‌తో 4 కీలక వికెట్లు తీసి ఆర్సీబీ విజయానికి కారణమయ్యాడు. అతని ప్రదర్శన ఆర్సీబీకి మ్యాచ్‌ను గెలిపించి, అతన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిపింది. కోహ్లీ మరియు ఫాల్ట్ అద్భుతంగా ఆడారు, కానీ కృణాల్ పాండ్యా నిజమైన హీరో.

ఐపీఎల్ మెగా సమరం మొదలైపోయింది. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభ వేడుకలతో ఐపీఎల్ 18వ సీజన్ షురువైంది. మొట్టమొదటి మ్యాచ్‌లో హోం టీమ్, డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను ఆర్సీబీ మట్టి కరిపించింది. ఫస్ట్ ఓవర్‌లోనే డేంజరస్ క్వింటన్ డికాక్‌ను అవుట్ చేసి హెజల్‌వుడ్ ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఇక ఆ తర్వాత మొదలైంది నైట్ రైడర్స్ ఊచకోత. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్, టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానె కొట్టాడు.. వామ్మో మామూలు కొట్టుకు కాదు అది. రహానె ఏంటి ఇంత కసిగా ఆడుతున్నాడు అనిపించింది.
అలాగే సునీల్ నరైన్ కూడా సూపర్ బ్యాటింగ్‌తో కేకేఆర్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చారు. వాళ్లిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే.. కేకేఆర్ ఈజీగా 220 పైనే స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ, ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కేకేఆర్ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు పోశాడు. 10వ ఓవర్ చివరి బంతికి నరైన్‌ను యువ బౌలర్ రసిక్ దార్ అవుట్ చేసిన తర్వాత.. కృనాల్ కేకేఆర్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. 11వ ఓవర్ మూడో బంతికి భీకరంగా ఆడుతున్న రహానెను అవుట్ చేశాడు, ఆ తర్వాత 13వ ఓవర్ తొలి బంతికే వెంకటేశ్ అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు, 15వ ఓవర్ చివరి బంతికి డేంజరస్ రింకూ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మూడు వికెట్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
10 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 107 పరుగులతో చేతిలో 8 వికెట్లుతో ఉన్న కేకేఆర్ ఈజీగా200 స్కోర్ దాటేస్తుందని మినిమమ్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్లు ఎవరైనా చెప్పేస్తారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేసింది మాత్రం కృనాల్ పాండ్యా. ఆ తర్వాత సుయాశ్ శర్మ రసెల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో కేకేఆర్ కేవలం 174కే పరిమితమైంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్, అద్బుతమైన బ్యాటింగ్ పిచ్‌పై ఇంత తక్కువ స్కోర్‌కే పరిమితం అయిందంటే.. అందుకే కృనాల్ పాండ్యానే కారణం. అందుకే అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపియ్యాడు. చాలా మంది ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఎస్ వాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ, కృనాల్ పాండ్యా ఈజ్ రియల్ హీరో ఫర్ ఆర్సీబీ అని చెప్పి తీరాలి.
KRUNAL PANDYA WON POTM AWARD ON HIS RCB DEBUT. 🥶👌 pic.twitter.com/Y8bYkwCsLM
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.