Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Population: నార్త్‌లో గణనీయంగా పెరిగిన జనాభా.. మరి సౌతిండియాలో ఎందుకు తగ్గిందంటే..

South Vs North Population: చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనేక అంశాలను లేవనెత్తుతోంది. ఓ వైపు రాజకీయ ప్రకంపనలు, మరో వైపు పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది. ఈ క్రమంలో జనాభా పెరుగుదల విషయంలో సౌత్‌ వర్సెస్ నార్త్‌పై చర్చ సాగుతోంది.

India Population: నార్త్‌లో గణనీయంగా పెరిగిన జనాభా.. మరి సౌతిండియాలో ఎందుకు తగ్గిందంటే..
India Population
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 23, 2025 | 8:20 AM

South Vs North Population: చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనేక అంశాలను లేవనెత్తుతోంది. ఓ వైపు రాజకీయ ప్రకంపనలు, మరో వైపు పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది. ఈ క్రమంలో జనాభా పెరుగుదల విషయంలో సౌత్‌ వర్సెస్ నార్త్‌పై చర్చ సాగుతోంది. నార్త్‌లో జనాభా పెరుగుదల ఏ స్థాయిలో ఉంది? జనాభా పెరుగుదల విషయంలో ఏ రాష్ట్రం ముందుంది? ఆసక్తికర వివరాలను తెలుసుకోండి..

జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టం జరగబోతుంది. చెన్నై సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ఉద్దేశమిదే. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 1971 లెక్క ప్రకారం చూస్తే సౌత్ కంటే నార్త్‌లో జనాభా గణనీయంగా పెరిగింది. నార్త్ కంటూ పోతుంది.. సౌత్ కంట్రోల్ కంట్రోల్ అంటూ పొదుపు మంత్రం పాటిస్తుంది. దీంతో నార్త్‌లో జనాభా అమాంతం పెరిగిపోగా.. సౌత్‌ జనాభా తగ్గిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి

రాజస్థాన్‌లో జనాభా పెరుగుదల 210 శాతం ఉంది. ఆ తర్వాతి స్థానంలో బిహార్ ఉంది. అక్కడ జనాభా పెరుగుదల 190 శాతం ఉంది. మధ్యప్రదేశ్‌లో జనాభా పెరుగుదల 183 శాతం ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో 166 శాతంగా ఉంది. ఇక ఆ తర్వాత మహారాష్ట్రలో జనాభా పెరుగుదల 151 శాతం ఉంది. 1971 జనాభా లెక్కలతో పోల్చితే ఈ రకంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సౌత్‌కి విషయానికి వస్తే.. ఏ స్టేట్ చూసినా ఉత్తరాది రాష్ట్రాల కంటే తక్కువగానే ఉంది జనాభా పెరుగుదల. కర్నాటకలో జనాభా పెరుగుదల 134 శాతంగా ఉంది. నార్త్‌లో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే కూడా కర్నాటక జనాభా పెరుగుదల తక్కువ. ఇక ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ జనాభా 116 శాతమే. తమిళనాడులో 89 శాతం, కేరళ 64 శాతం పెరుగుదలతో చివరి స్థానంలో ఉంది.

లెక్కలు మాత్రం స్పష్టంగా కళ్లకు కడుతున్నాయి. పార్టీల రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా.. సౌత్ కంటే నార్త్‌లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందనేది సుస్పష్టం. రాజస్థాన్ కంటూ పోతుంది. కేరళ మాత్రం పొదుపు మాత్రం పాటిస్తుంది. ఎందుకు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ లెక్కలు చూపుతూ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉందని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. పునర్విభజన జరిగితే సౌత్ స్టేట్స్ నష్టపోతాయని వాదిస్తున్నాయి.

అయితే, బీజేపీ మాత్రం చెన్నైలో భేటీ అయిన పార్టీల వాదనతో విభేదిస్తోంది. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని స్పష్టం చేస్తోంది. తమిళనాడులో మాత్రమే జనాభా తక్కువగా పెరిగిందని అంటున్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్. తమిళనాడు సమస్యను సౌత్ మొత్తానికి ఆపాదిస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్, బిహార్‌లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండగా.. తమిళనాడు, కేరళలో తక్కువగా ఉంది. కుటుంబ నియంత్రణే ఈ తగ్గుదలకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..