Tollywood: టెన్త్‌లో 94%, బీటెక్‌లో 85%.. ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఈ అమ్మాయి చదువులో టాపర్. ఎంతలా అంటే పదో తరగతిలో 94 శాతం మార్కులు సాధించింది.ఇక ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఏకంగా 85 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కూడా చేరింది.. కానీ..

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పటివరకు మూడంటే మూడే సినిమాలు చేసింది. అందులో రెండు ఏకంగా బ్లాక్ బస్టర్ మూవీస్. అందుకే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అది కూడా న్యాచురల్ స్టార్ నాని, సిద్దూ జొన్నల గడ్డ, కిచ్చా సుదీప్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకనే అవకాశం వచ్చింది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా మరి? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ బ్యూటీ నటించిన రెండో సినిమాలనే ఏకంగా రూ.1250 కోట్లు రాబట్టింది. తద్వారా భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అదే నండి కేజీఎఫ్ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇది ఆమె స్కూల్ డేస్ నాటి ఫొటో.
కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన శ్రీనిధి శెట్టి చిన్నతనం నుంచే ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది . చదువుకుంటూనే డ్యాన్స్, వాలీబాల్, త్రో బాల్, స్విమ్మింగ్ లో నైపుణ్యం సంపాదించింది. ఇక చదువులోనూ ఈ బ్యూటీ డిస్టింక్షన్. మొదట ఈ ముద్దుగుమ్మ డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ బీటెక్ లో 85 శాతం మార్కులు తెచ్చుకుని బెంగళూరులోని ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరింది. అదే సమయంలో మోడలింగ్ లోనూ అడుగు పెట్టింది. అయితే ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందీ అందాల తార. అయితేనేం పలు అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది.
హిట్ 3 సినిమా సెట్ లో శ్రీనిధి శెట్టి..
View this post on Instagram
ఇక కేజీఎఫ్ తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత కేజీఎఫ్ 2 తోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది. విక్రమ్ కోబ్రా నిరాశపర్చినా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న హిట్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డసరసన ‘తెలుసు కదా’ మూవీలో నటిస్తోంది శ్రీనిధి. వీటితో పాటు కిచ్చా సుదీప్ సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోందీ అందాల తార.
శివరాత్రి వేడుకల్లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.