ప్రకంపనలు సృష్టిస్తున్న అమెరికా కాపిటల్ హింసాత్మక ఘటన.. రాజీనామా బాటపడుతున్న వైట్‌హౌస్ ఉన్నతాధికారులు

కేపిటల్ చీఫ్ స్టీవెన్ సుండ్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న అమెరికా కాపిటల్ హింసాత్మక ఘటన.. రాజీనామా బాటపడుతున్న వైట్‌హౌస్ ఉన్నతాధికారులు
Follow us

|

Updated on: Jan 08, 2021 | 5:06 PM

US capitol chief resigns: అమెరికాలో క్యాపిటల్ భవనం వద్ద బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్ ఉన్నతాధికారులు పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి బాటలోనే తాజాగా కేపిటల్ చీఫ్ స్టీవెన్ సుండ్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. యూఎస్ కాపిటల్ పై బుధవారం హింసాత్మక ఘటనకు పాల్పడిన గుంపును నిరోధించడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎస్ కాపిటల్ పోలీస్ చీఫ్ స్టీవెన్ సుండ్ గురువారం తన పదవికి రాజీనామా చేసినట్లు యూఎస్ కాపిటల్ పోలీసు అధికారులు తెలిపారు. స్టీవెన్ సుండ్ రాజీనామా జనవరి 16 వతేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతున్నారు. ఈనేపథ్యంలో ట్రంప్ అభిమానులు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను నిరసిస్తూ ట్రంప్ మద్ధతుదారులు కేపిటల్ భవనంపైకి రావడంతో పోలీసులతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ అల్లర్లలో మరో అమెరికా పోలీసు అధికారి మరణించారు. దీంతో ఆందోలనలను నియంత్రించడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ పలువురు అధికారులు రాజీనామా బాటపట్టారు. ఇప్పటికే వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సారా మాథ్యూస్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, స్టెఫానీ గ్రిషామ్, వైట్‌హౌస్ సామాజిక కార్యదర్శి అన్నా క్రిస్టినా, రవాణా కార్యదర్శి ఎలైన్ చావో తన పదవులకు రాజీనామా చేశారు.

ఇదీ చదవండి….

UN On US Capitol Riots: అమెరికాలోని హింసాత్మక సంఘటనపై స్పందించిన ఐరాస, నాయకులు పరిణితితో నడుచుకోవాలని సూచన