Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా 2021 ఫుల్ షెడ్యూల్.. ఏడాదంతా బిజీబిజీ.. కోహ్లీసేన ముందు ఎన్నో సవాళ్లు..

India Full Schedule 2021: 2020 క్రీడారంగానికి ఓ పీడకల. కరోనా కారణంగా ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు ఆగిపోయాయి. అత్యంత ధనిక లీగ్..

టీమిండియా 2021 ఫుల్ షెడ్యూల్.. ఏడాదంతా బిజీబిజీ.. కోహ్లీసేన ముందు ఎన్నో సవాళ్లు..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2021 | 2:52 PM

India Full Schedule 2021: 2020 క్రీడారంగానికి ఓ పీడకల. కరోనా కారణంగా ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు ఆగిపోయాయి. అత్యంత ధనిక లీగ్ ఐపీఎల్ కూడా ఓ తరుణంలో వాయిదా పడాల్సి ఉండగా.. బయోబబుల్ వాతావరణంలో బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహించింది. ఇదిలా ఉంటే గతేడాది ఎండింగ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడమే కాకుండా టెస్టుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసుకుంది. అయితే బాక్సింగ్ డే టెస్టులో పుంజుకుని అపూర్వ విజయాన్ని అందుకుంది. ఫుల్ జోష్‌తో 2021ను వెల్‌కమ్ చెప్పింది. ఇక ఈ ఏడాదిలో కూడా టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది.

  1. జనవరి – ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు
  2. ఫిబ్రవరి-మార్చి: భారత్ వెర్సస్ ఇంగ్లాండ్( 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు)
  3. ఏప్రిల్-మే: ఐపీఎల్ 2021
  4. జూన్: భారత్ వెర్సస్ శ్రీలంక( 3 వన్డేలు, 5 టీ20లు)
  5. జూన్-జూలై: ఆసియా కప్ 2021
  6. జూలై: భారత్ వెర్సస్ జింబాబ్వే
  7. ఆగష్టు-సెప్టెంబర్: ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత్
  8. అక్టోబర్-నవంబర్: 2021 టీ20 వరల్డ్ కప్న
  9. నవంబర్-డిసెంబర్: న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు
  10. డిసెంబర్: దక్షిణాఫ్రికాకు పర్యటించనున్న టీమిండియా