- Telugu News Photo Gallery Cinema photos Tollywood hereos like prabhas allu arjun jr ntr huge remuneration details
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
అవి ఒక్క సినిమాకు ఇస్తున్న రెమ్యునరేషన్లా లేదంటే సినిమా మొత్తానికి పెడుతున్న బడ్జెట్లా..? 100, 200 కోట్లు ఏంటి గురూ..? సినిమా మొత్తానికి 200 కోట్లు వస్తేనే పండగ చేసుకునే రోజులివి. అలాంటిది ఒక్క సినిమాలో యాక్ట్ చేయడానికే హీరోకు 200 కోట్లు ఇస్తున్నారా అంటే ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో ముగ్గురు హీరోలు అదే స్థాయిలో తీసుకుంటున్నారు. మరి ఎవరు వాళ్లు..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 25, 2025 | 6:52 PM

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాల కంటే ఆయన రెమ్యునరేషన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. కేవలం మన దగ్గరే కాదు.. నేషనల్ మీడియా సైతం బన్నీ పారితోషికంపై స్పెషల్ ఫోకస్ చేస్తుందంటే సీన్ ఏంటో అర్థమైపోతుంది.

అట్లీ సినిమా కోసం ఈయన 200 కోట్ల రికార్డ్ పారితోషికం అందుకోబోతున్నారని తెలుస్తుంది. పుష్ప 2 సినిమాకు 300 కోట్లు అందుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా అప్పట్లో ప్రకటించింది. తాజాగా అట్లీ కోసం 200 కోట్ల పారితోషికంతో పాటు ప్రాఫిట్‌లో షేర్ తీసుకోనున్నారని తెలుస్తుంది.

అలాగే ప్రభాస్ కూడా మూడేళ్ళ కిందే సినిమాకు 150 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడా స్థాయి 200 నుంచి 220 కోట్లకు చేరుకుందని ట్రేడ్ చెప్తున్న మాట. ప్రభాస్ కూడా కొంత పారితోషికం, మిగిలింది షేర్ తీసుకుంటున్నారీయన. ఈ లెక్క 200 కోట్లకు పైగానే ఉంటుంది ప్రతీ సినిమాకు.

పైగా వర్కింగ్ డేస్ కూడా 90 రోజులకు మించి ఇవ్వట్లేదు రెబల్ స్టార్. తమిళంలో విజయ్ కూడా 200 కోట్ల పారితోషికం టచ్ చేస్తున్నారు. ఈయన చివరి సినిమా జన నాయగన్ కోసం భారీగానే అందుకుంటున్నారు.

చివరి సినిమా కావడంతో.. జన నాయగన్ కోసం 200 కోట్లకు పైగానే విజయ్ తీసుకున్నారని తమిళనాట ప్రచారం జరుగుతుంది. పొంగల్ కానుకగా 2026, జనవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ ముగ్గురే కాదు.. స్టార్ హీరోస్ అంతా రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ వైపు వెళ్తే నిర్మాతలకు కాస్త భాగం తగ్గుతుందేమో..? అగ్ర దర్శకులు ప్రస్తుతం ఇదే చేస్తున్నారు.





























