గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఎంతో మంది మనసు దోచుకుంది. ఈ సింగర్ పాటలు అంటే చాలా మందికి ఇష్టం. తెలుగు, తమిళం, హిందీ ఇలా అనేక భాషల్లో శ్రేయ సాంగ్స్ పాడి పాన్ ఇండియా గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ కూడా ఈమె.
Updated on: Mar 25, 2025 | 6:23 PM

నమ్మిన నామది మంత్రాలయమే...పిల్ల గాలి అల్లరి, సూసేటి అగ్గిరవ్వ మాది, జల జల జలపాతం నువ్వు ఇలా చాలా సాంగ్స్ పాడి మంచి ఫేమ్ సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది శ్రేయ ఘోషల్.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శ్రేయ, తాజాగా తన ఇన్ స్టాలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. అందులో ఈ గాయని చూడటానికి చాలా గ్లామర్ గా కనిపించింది. బ్లూ అవుట్ ఫిడ్ డ్రెస్ లో స్టార్ హీరోయిన్స్ కూడా షాక్ అయ్యే విధంగా కుందనపు బొమ్మలా రెడీ అయ్యింది.

ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్స్ ఈ ఫొటోలు చూస్తే స్టార్ హీరోయిన్లు అసూయ పడటం ఖాయం, అంత అందంగా శ్రేయ ఘోషల్ ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక తాజాగా ఈ సింగర్ ఐపీఎల్ వేదికపై తన గాత్రంతో అందరినీ మైమరిపించింది. మొదట హిందీ సాంగ్స్ పాడుతూ అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తర్వాత పుష్ప 2, సూసెటి అగ్గిరవ్వ మాదిరి అంటూ అందరిలో జోష్ నింపింది.

అయితే శ్రేయ ఘోషల్ ఐపీఎల్ ఈవెంట్ సందర్భంగానే బ్యూటిఫుల్ గా రెడీ అయినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ వేదికపై ఈ గాయనీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.





























