క్రేజీ ఫోటోలు షేర్ చేసిన అర్జున్ రెడ్డి భామ.. అందాలు అదుర్స్ అంటున్న అభిమానులు..
షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. జబల్‌పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన షాలిని, చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.
Updated on: Mar 25, 2025 | 2:22 PM

షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. జబల్‌పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన షాలిని, చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.

ఇంజనీరింగ్ చదువుతున్న రెండవ సంవత్సరం నుంచే ఆమె నాటకాల్లో నటించడం ప్రారంభించింది. షాలిని పాండే 2017లో విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె ప్రీతి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా భారీ విజయం సాధించడంతో షాలినికి విశేష గుర్తింపు లభించింది. తెలుగు మాట్లాడడం రానప్పటికీ, ఈ చిత్రంలో తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని తెలుగులో మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది.

ఆమె తమిళ సినిమా 100% కాదల్ లో కూడా కనిపించింది. హిందీలో జయేష్‌భాయ్ జోర్దార్, మహారాజ్ చిత్రాలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మహారాజ్ చిత్రంలో ఆమె నటన, ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షాలిని. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.