Natasa Stankovic: ‘నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు’.. మళ్లీ ప్రేమలో పడడంపై హార్దిక్ మాజీ భార్య నటాషా
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ 2024లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు నటాషా మళ్లీ ప్రేమలో పడతానంటోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను అనుభవాల నుంచి ఎదిగానని, జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని నటాషా వెల్లడించింది

టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా , నటి మోడల్ నటాషా 2024లో విడిపోయారు. దీంతో 4 సంవత్సరాల వీరి దాంపత్య బంధానికి ఫుల్ స్టాప్ పడింది. హార్దిక్, నటాషాలకు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. తరచుగా, హార్దిక్, అగస్త్య కలిసి కనిపించే వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో హార్దిక్ బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక హార్దిక్ మాజీ భార్య నటాషా కూడా మళ్లీ ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉందంటోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను నా అనుభవాల ద్వారా ఎదుగుతున్నాను. జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా స్వీకరించడానికి ను సిద్ధంగా ఉన్నాను. మళ్లీ ప్రేమలో పడటానికి నాకు అభ్యంతరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి దొరుకుతాడు. నమ్మకం, పరస్పర అవగాహనపై నిర్మితమైన అర్థవంతమైన సంబంధాలను నేను విలువైనదిగా భావిస్తాను. ప్రేమ నా ప్రయాణానికి తోడుగా ఉండాలని నేను భావిస్తున్నాను” అని నటాషా చెప్పింది.
‘జీవితం ఎప్పుడూ అనుకున్నట్లు సాగదు. అటువంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఒకరు ఎలా స్పందిస్తారనే దానిపైనే మన భవిష్యత్ ఆధార పడి ఉంటుంది. ఎదురుదెబ్బలను వైఫల్యాలుగా చూడకూడదు. అవి మీకు అనుభవాన్ని ఇస్తాయి. అన్నిటినీ ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలి’అని ఫిలాసఫీ చెబుతోంది నటాషా.
కుమారుడు అగస్త్య తో నటాషా స్టాంకోవిక్..
View this post on Instagram
నటాషా, హార్దిక్ 2020లో వివాహం చేసుకున్నారు. గత ఏడాది జూలైలో వారు విడిపోయారు. పరస్పర అంగీకారం తర్వాత ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. హార్దిక్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది నటాషా.
నటాషా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
జిమ్ లో వర్కట్స్ చేస్తూ..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .