TV9 Telugu
21 March 2025
ఈ జాబితాలో 10వ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, 2025 సీజన్ నాటికి అతని సంపాదన రూ.105.65 కోట్లకు చేరుకుంటుంది.
హార్దిక్ కంటే కొంచెం ముందు, 9వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ఉన్నాడు, 2025 సీజన్ నాటికి అతని సంపాదన రూ. 108.58 కోట్లకు చేరుకుంటుంది.
ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ సురేష్ రైనా జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. మొత్తం రూ.110.74 కోట్లు సంపాదించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ రూ. 113.10 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.
రూ. 27 కోట్ల రికార్డు ధరతో చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పుడు రూ. 117.80 కోట్లు సంపాదించాడు.
టాప్-10లో ఉన్న ఏకైక విదేశీ ఆటగాడు విండీస్ మాజీ లెజెండ్ సునీల్ నరైన్. ఈ KKR స్టార్ రూ. 125.24 కోట్లతో 5వ స్థానంలో ఉన్నాడు.
ఐదుసార్లు ఛాంపియన్ అయిన కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో కేవలం రూ. 4 కోట్లు మాత్రమే పొందుతున్నాడు. దీని కారణంగా అతను మూడో స్థానానికి పడిపోయాడు. అతని సంపాదన రూ. 192.84 కోట్లు.
ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదన రూ.209.20 కోట్లకు చేరుకుంది. దీంతో రెండవ స్థానానికి చేరుకుంది.
ముంబై ఇండియన్స్‌కు 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ 210.90 కోట్ల రూపాయల సంపాదనతో నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు.