India Vs Australia 2020: ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపత్యం చెలాయించాలి.. సిరీస్ గెలుపొందాలి: అక్తర్

India Vs Australia 2020: టీమిండియాపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయిబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. అడిలైడ్‌లో ఘోర పరాజయం ఎదుర్కున్న..

India Vs Australia 2020: ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపత్యం చెలాయించాలి.. సిరీస్ గెలుపొందాలి: అక్తర్
Follow us
Ravi Kiran

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 01, 2021 | 3:06 PM

India Vs Australia 2020: టీమిండియాపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయిబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. అడిలైడ్‌లో ఘోర పరాజయం ఎదుర్కున్న తర్వాత బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తాత్కాలిక కెప్టెన్ రహనే సెంచరీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చాడు.

‘రహనే కెప్టెన్సీలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఒక దశలో తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యేలా కనిపించినా.. రహనే అద్భుత శతకంతో అదరగొట్టాడు”. అని అక్తర్ పేర్కొన్నాడు. అలాగే ఈ సిరీస్‌లో ఇండియా గెలుపొందాలని కోరుకున్నాడు.

”10-15 ఏళ్ల క్రిందట ఆసియా టీంలు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలయిస్తామని అనుకున్నామా.? ఇప్పుడు అది జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇండియా గెలవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. రహనే సెంచరీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది”. అని అన్నాడు.