సర్వరోగ సంజీవని ఈ నీరు.. పరగడుపున తాగితే రోగాలన్నీ పరార్!

19 March 2025

TV9 Telugu

TV9 Telugu

హృదయాకారంలో పచ్చగా నిగనిగలాడే తమలపాకులు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో, వీటికి ఔషధ గుణాలే కాదు, సాంస్కృతిక ప్రాధాన్యమూ ఎక్కువే

TV9 Telugu

తమలపాకుల్నే నాగవల్లి ఆకులనీ పిలుస్తారు. దక్షిణాసియా మొత్తం విరివిగా కనిపించే ఈ మొక్కను ఒక్కసారి నాటితే చాలు ఏళ్లు బతికేస్తుంది. దీన్ని ఆంగ్లంలో బీటల్‌ అని పిలుస్తారు

TV9 Telugu

తమలపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే మన పూర్వికుల నుంచి నేటి వరక ఆయుర్దేధంలో వీటిని పలు ఆరోగ్య సమస్యల నివారణకు వినియోగిస్తున్నారు

TV9 Telugu

వీటిల్లో మంచి మొత్తంలో కాల్షియం, ఇనుము ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

తమలపాకులను అనేక రకాలుగా తినవచ్చు. తమలపాకుల నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు తమలపాకులను మరిగించి ఆ నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తమలపాకుల నీరు త్రాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

జీర్ణక్రియను మెరుగుపరచడంలో తమలపాకు నీరు ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి

TV9 Telugu

ఖాళీ కడుపుతో తమలపాకు నీరు తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి, జలుబు మొదలైన సమస్యలను నివారిస్తుంది. ఖాళీ కడుపుతో తమలపాకు నీటిని తాగడం వల్ల బరువు తగ్గడం, మెరిసే చర్మం, నోటి దుర్వాసన నుంచి బయటపడొచ్చు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ, శరీర నిర్విషీకరణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి