Cricket: ఒరేయ్ ఆజామూ.! అది క్రికెటా.. కర్రా బిళ్లానా.. ఇంత వెర్రి వెధవలేంట్రా మీరు..
అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఏ ఆటగాడైనా కూడా.. తన ఫాం, ఆట సరిగ్గా లేకపోతే రిటైర్ మెంట్ ప్రకటిస్తాడు. కానీ ఇక్కడ ఓ ప్లేయర్ ఒకటి లేదా రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు రిటైర్ మెంట్ ప్రకటించాడు. మరి అతడెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

పాకిస్తాన్ క్రికెట్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది తన కెరీర్‌లో మూడుసార్లు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. 2006లో తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించి, 2010లో తిరిగి వచ్చాడు. 2011లో రెండోసారి, 2017లో మూడోసారి రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది.. ప్రతిసారీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
క్రికెట్ చరిత్రలో చాలామంది ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుని మళ్లీ తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మాత్రం ఇందుకు భిన్నంగా రేర్ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడు ఏకంగా మూడుసార్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి.. మూడుసార్లూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అఫ్రిది తొలిసారి 2006వ సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు, జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కొరత కారణంగా 2010లో మళ్లీ ఆటలోకి వచ్చాడు. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే అతడు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మళ్లీ ఆడటం ప్రారంభించాడు.
చివరిగా, 2017వ సంవత్సరంలో మూడోసారి రిటైర్మెంట్ ప్రకటించిన షాహిద్ అఫ్రిది, ఆ మరుసటి ఏడాది 2018లో లార్డ్స్ వేదికగా జరిగిన రెస్ట్ ఆఫ్ వరల్డ్ జట్టు తరఫున ఒక మ్యాచ్ ఆడేందుకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత అతడు మళ్లీ పాకిస్తాన్ జట్టు తరఫున ఆడలేదు. షాహిద్ అఫ్రిది కెరీర్‌లో ఈ మూడు రిటైర్మెంట్లు, తిరిగి రావడం ఓ ఆసక్తికర అధ్యాయం అని చెప్పొచ్చు. కాగా, ఈ రేర్ ఫీట్ గురించి ఇప్పటికే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలిసిందే. కేవలం పాకిస్తాన్ క్రికెట్‌లోనే ఇలాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొంటాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..




