వెనిజులా నుంచి రూ.46వేల కోట్ల గోల్డ్ స్మగ్లింగ్..! కుంభకోణం వెనక ఉన్నది మదురోనేనా?
ప్రస్తుతం అమెరికాలో బందీగా ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోపై కస్టమ్స్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. అతను దేశంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలోని సుమారు రూ.46వేల కోట్ల విలువైన బంగారం నిల్వలను స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం విక్రయించే క్రమంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు.

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోకి సంబంధిచిన కస్టమ్స్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. మదురో వెనిజులాకు తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దేశంలో భారీ కుంభకోణానికి తెరలేపినట్టు ఆరోపించారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం వెనిజులా సంక్షోభంలో ఉన్న సమయంలో దేశంలో ఉన్న బంగారు నిల్వలను విక్రయించి ఆ పర్థితులను అదిగమించాలనుకుంది. ఈ క్రమంలోనే 2013 నుంచి 2016 వరకు దేశంలో అధ్యక్షుడిగా ఉన్న మదురో దేశంలోని సెంట్రల్ బ్యాంకులో ఉన్న 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విజ్జర్‌ల్యాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నాయి.
ఇక దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు, నియమ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో వెనిజులాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) 2017 నవంబర్ నుంచి ఆంక్షలు విధించింది. దీంతో ఆ తర్వాత వెనిజులా నుండి స్విట్జర్లాండ్‌కు ఎలాంటి బంగారం ఎగుమతులు జరగలేదని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఇక జనవరి 3న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్య-ఉగ్రవాదం ఆరోపణలతో మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. దీంతో మదురో సహా అతని 36 మంది సహచరులకు సంబంధించిన ఆస్తులను జప్త్ చేయాలని స్వర్జర్‌ల్యాండ్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా శుద్ది చేయడానికో లేదా సర్టిఫికేషన్ కోసమో వెనిజులా ఈ బంగారాన్ని సిర్జర్‌ల్యాండ్‌కు తరలించి ఉండవచ్చని SRF నివేదించింది. ఎందుకంటే స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రాలలో ఒకటి, ఆ దేశంలో ఐదు పెద్ద శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. మరోవైపే అమెరికా ఆంక్షల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, డబ్బును సేకరించడానికి వెనిజులా కేంద్ర బ్యాంకు తన బంగారు నిల్వలను విక్రయించి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
