ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?
నాకు అనుమతివ్వండి... అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా... అంటోంది ఓ ఉక్రెయిన్ మహిళ. భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానంటోంది. తన గురువు కల్యాణికి గురుదక్షిణ చెల్లించుకుంటానని చెబుతోంది. లిడియా లక్ష్మి వ్యాఖ్యలతో అన్వేష్ కథ మరోసారి తెరపైకి వచ్చింది..

నాకు అనుమతివ్వండి… అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా… అంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి.. అతను ఎక్కడున్న భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానని పేర్కొనడం సంచలనంగా మారింది.. కాగా.. లిడియా లక్ష్మి.. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడింది. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆకర్షితురాలై ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసింది లిడియా లక్ష్మి. ఈ నేపథ్యంలో నా అన్వేష్ భారతీయ సంప్రదాయాలపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారామె. థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె తనకు అవకాశం ఇస్తే అన్వేష్‌ను పట్టుకొస్తానని చెబుతోంది. లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని చెబుతోంది. ఇప్పటికే తన హెచ్చరికల వల్ల అతడు కాంబోడియా, మలేషియా పారిపోయాడని ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ఉన్నాడని, తనకు అవకాశం ఇస్తే అన్వేష్‌ను భారత్‌కు తీసుకొచ్చి పడేస్తానంటోంది లిడియా లక్ష్మి.
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్‌పై ఇప్పటికే హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అన్వేష్‌పై వివిధ పోలీస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి యూట్యూబ్ ఛానల్ మూసేయాలని పంజాగుట్ట పోలీస్టేషన్‌లో కరాటే కల్యాణ్ ఫిర్యాదు చేశారు. ఐటి యాక్ట్ 67 తో పాటు 69A సెక్షన్ ని కూడా FIR లో పొందుపరచాలని కోరారు కళ్యాణి. ఇంకా దేశంలోని చాలా చోట్ల అన్వేష్‌పై కేసులు నమోదయ్యాయి. హిందువులు దేవతగా కొలిచే సీతాదేవి గురించి అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యావత్ హిందూ సంఘాలన్నీ భగ్గుమన్నాయి. అతడిని ఇండియాకు తీసుకురావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నాయి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
