AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US-Russia Tensions: సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు.. రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా!

US Seizes Venezuela Oil Tanker: ఉత్తర అట్లాంటిక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వెనిజులా నుంచి చమురు తీసుకెళ్తున్న రెండు నౌకలను అమెరికా కోస్ట్‌గార్డ్ స్వాధీనం చేసుకుంది. అందులో ఒక రష్యన్ నౌక ఉండటంతో రష్యా తీవ్రంగా స్పందించింది. తమ నౌక అంతర్జాతీయ చట్టాలకు లోబడే ప్రయాణించిందని, స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్ అమెరికా చర్యకు మద్దతు తెలపడంతో పరిస్థితి మరింత జఠిలమైంది.

US-Russia Tensions: సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు.. రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా!
Us Russia Tensions
Anand T
|

Updated on: Jan 08, 2026 | 9:30 AM

Share

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో రెండు అగ్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వెనెజువెలా నుంచి చమురు తీసుకెళుతున్న 2 నౌకలను అమెరికా కోస్ట్‌గార్డ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని సీజ్ చేశారు. అయితే ఈ నౌకల్లో ఒకటి రష్యాకు చెందిన నౌక కూడా ఉంది. దీంతో ఇందులోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. అమెరికన్ బలగాలు ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం మీదుగా కరీబియన్‌ దీవుల్లో వెళ్తున్న తమ నౌకలను వెంటాడి పట్టుకోవడాన్ని రష్యా తప్పుబట్టింది. అయితే అమెరికన్ చర్యను సపోర్ట్ చేస్తూ బ్రిటన్ స్పందించడం మరింత ఉద్రిక్తలకు దారి తీసింది.

అయితే అమెరికా వద్ద బందీగా ఉన్న రష్యన్ నౌక మ్యారినెరాగా తెలుస్తోంది. ఈ నౌకకు ఇదువరకు గుయానా జెండా ఉండగా ఇటీవలే దానిపై రష్యా జెండాను అమర్చారు. అయితే సిరగ్గా ఐస్‌లాండ్‌ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో ఉండగా రష్యన్ జెండాతో వెళ్తున్న నౌకతో పాటు ఎలాంటి జెండా లేని మరో నౌకను అమెరికన్ బలగాలు చుట్టుముట్టాయి. ఆ వెంటనే అమెరికన్ హెలికాప్టర్లు రైష్యన్ నౌకపై దిగాయి. వెంటనే నౌకలోని రష్యను సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర జలాల్లో అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో బ్రిటన్‌లు బలగాలు సైతం పాల్గొన్నట్టు తెలుస్తోంది.

అయితే వెనిజులా నుంచి చమురు తెచ్చేందుకు రష్యా నౌక వెళ్లిన నేపథ్యంలో దానికి రక్షణగా కొన్ని రోజుల కిందటే రష్యా ఒక జలాంతర్గామితోపాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపినట్టు తెలుస్తోంది. అయితే అమెరికన్ బలగాలు రష్యాకు చెందిన చమురు నౌకను సీజ్ చేసిన సమయానికి.. రష్యా పంపిన రక్షణ నౌకలు దానికి సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

రష్యా రియాక్షన్

అయితే వెనిజులా నుంచి చమురు తీసుకొస్తూ ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర జలాల్లో ఉన్న తమ నౌకను అమెరికన్ బలగాలు అడ్డుకున్న వెంటనే రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకనట విడుదల చేసింది. తమ నౌక అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనల ప్రకారమే ప్రయాణిస్తుందని.. అన్ని నిబంధనలు పాటిస్తున్నప్పటికీ అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 1982 నాటి ఐరాస కన్వెన్షన్‌లో చేసిన సముద్ర చట్టం ప్రకారం.. ఒక దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని రష్య పేర్కొంది. అమెరికన్‌ బలగాలు సీజ్ చేసిన నౌకలో ఉన్న రష్యన్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలాని కోరింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతి ఎఫెక్ట్.. నాటుకోళ్ల ధరలకు రెక్కలు.. కేజీ ఎంతో తెలిస్తే.
సంక్రాంతి ఎఫెక్ట్.. నాటుకోళ్ల ధరలకు రెక్కలు.. కేజీ ఎంతో తెలిస్తే.
మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం
మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం
టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?
టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల
గురకను లైట్ తీసుకుంటే ప్రాణాలకే ముప్పు..ఎలాగో తెలుసా?
గురకను లైట్ తీసుకుంటే ప్రాణాలకే ముప్పు..ఎలాగో తెలుసా?
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి అరుణ కూతురు..
అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి అరుణ కూతురు..
టీమిండియా తలుపు తట్టిన 4 ఐపీఎల్ స్టార్స్.. అరంగేట్రానికి సిద్ధం..
టీమిండియా తలుపు తట్టిన 4 ఐపీఎల్ స్టార్స్.. అరంగేట్రానికి సిద్ధం..
'జన నాయకుడు' వాయిదా.. ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
'జన నాయకుడు' వాయిదా.. ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీకేర్‌ఫుల్
క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీకేర్‌ఫుల్