నెల్లూరు జూన్ 30: నెల్లూరు జిల్లా లోని కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య పెను ప్రమాదం తప్పింది. నర్సాపూర్ నుంచి ధర్మవరం కు వెళ్లే ఎక్స్ప్రెస్ కు ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెండు మీటర్ల పొడవున ఉన్న రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ పట్టా ముక్కను నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్ప్రెస్ ఢీ కొంది. అదృష్టవశాత్తు పట్టా ముక్క దూరంగా పడిపోవడంతో ప్రమాదం తప్పింది.
గత కొంతకాలంగా వివిధ మార్గాల్లో రైళ్లు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణీకులను భయాందోళకు గురి చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం తప్పిన రైలు ప్రమాదంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా రైలు పట్టాల మధ్య ఒక ఇనుప ముక్కను అడ్డుగా పెట్టడం వెనుక కారణం ఏమిటి అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ఆకతాయి అనుకోకుండా చేసినా పనా.. లేక ఎవరైనా సంఘ విద్రోహులు చేసిన పనా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..