Parvathipuram: పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. ఒకే రోజు దిశ ఎస్సై ఇంట్లో సహా పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు

పాలకొండ DSP కార్యాలయానికి సమీపంలోనే నివాసం ఉంటోన్న దిశ పోలీస్ స్టేషన్ SI లావణ్య వీధుల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రానికి వెళ్ళారు. రాత్రికి పార్వతీపురంలోనే ఉండిపోయారు. ఆమె తల్లి రూప సైతం అదే రోజు ఊరుకి వెళ్ళారు. అది గమనించిన దొంగలు అదే రోజు రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు పక్కంటి వారు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి SI కి సమాచారం ఇవ్వగా దొంగతనం అయినట్లు గుర్తించారు.

Parvathipuram: పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. ఒకే రోజు దిశ ఎస్సై ఇంట్లో సహా పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు
Disha Si House
Follow us

| Edited By: Surya Kala

Updated on: Dec 10, 2023 | 1:17 PM

సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే పోలీసులకు చెబుతాం.. కానీ పోలీసుల ఇళ్ళలోనే దొంగలు పడితే.. వారు ఎవరికి చెప్పుకుంటారు. అదే పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చోటు చేసుకుంది. పాలకొండలో శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రాత్రికి రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు ఇళ్లల్లో చోరీలకు పాల్పడితే బాధితుల్లో దిశ SI తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. పోలీసుల ఇళ్లల్లోనే దొంగతనాలు జరగటం ఒక ఎత్తయితే.. అది కూడా DSP కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ దొంగతనాలు జరగటం మరో విశేషం.

పాలకొండ DSP కార్యాలయానికి సమీపంలోనే నివాసం ఉంటోన్న దిశ పోలీస్ స్టేషన్ SI లావణ్య వీధుల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రానికి వెళ్ళారు. రాత్రికి పార్వతీపురంలోనే ఉండిపోయారు. ఆమె తల్లి రూప సైతం అదే రోజు ఊరుకి వెళ్ళారు. అది గమనించిన దొంగలు అదే రోజు రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు పక్కంటి వారు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి SI కి సమాచారం ఇవ్వగా దొంగతనం అయినట్లు గుర్తించారు. ఇంట్లో ఉంచిన రూ.30 వేల నగదు, తులం బంగారం చోరీ అయినట్లు తెలిపారు.

దిశ SI నివాసంకి సమీపంలోనే ఓ కానిస్టేబుల్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువుల కోసం వెతికినప్పటికి వారికి ఏమి లభించకపోవడంతో తిరిగి వెనుతిరిగారు. ఆ ఇంటికి పక్క వీధి శ్రీనివాస నగర్ లో పంచాయితీరాజ్ శాఖ ఉద్యోగి గార కాంతారావు నివాసాన్ని అదే రోజు రాత్రి కొల్లగొట్టారు దొంగలు. కాంతారావు కుటుంభం కాశీకి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేకపోవటం గమనించి ఇంటి వెనుక మార్గం గుండా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనంకి పాల్పడ్డారు దొంగలు. వారి ఇంట్లో రూ. లక్షా 60వేల నగదుతో పాటు ముప్పావు తులం బంగారాన్ని దోచేశారు.

ఇవి కూడా చదవండి

దిశ ఎస్ఐ ఇంటికే భద్రత లేనప్పుడు ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అన్న చర్చ ఇప్పుడు పాలకొండ పట్టణంలో ఆనోటా ఈ నోట వినిపిస్తోంది. దీంతో పోలీసుల ఇజ్జత్ కా సవాల్ గా మారాయి ఈ దొంగతనాలు. దొంగల్ని పట్టుకుని పనిలో పడ్డారు ఇప్పుడు పోలీసులు.దొంగతనాలు జరిగిన ఇళ్ళను ఎస్.ఐ. శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం సైతం ఘటన స్థలాలకి చేరుకొని ఆదారాలను సేకరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..