ChandraBabu: ఏపీ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి.. ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ
మిచౌంగ్ తుఫాన్ 15 జిల్లాల్లోని రైతులను నిట్టనిలువున ముంచెత్తింది. రైతన్న కంట కన్నీరు మిగిల్చింది. తుఫాను దాటికి చేతి కొచ్చిన పంటలు నీట మునిగాయి. వరి, మిర్చి వంటి అనేక పంటలు మోకాలు లోతు నీటిలో మునిగిపోయి కుళ్లిపోయాయి. ఎకరాలకు లక్ష రూపాయల పెట్టుబడిపెట్టి నిలువునా నష్టపోయామంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తుపాన్ వలన నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు
మిచౌంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. రైతులకు కన్నీరు మిగిల్చింది మిచౌంగ్ తుపాను. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఏపీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మిచౌంగ్ తుపాన్ వలన నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రధాని మోడీకి చంద్రబాబు రాసిన లేఖలో మిచాంగ్ తుఫాన్ ను జాతీయవిపత్తుగా ప్రకటించాలని కోరారు. అందుకు తగిన విధంగా సాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సుమారు 15 జిల్లాల్లో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించిందని.. మొత్తం 22 లక్షల ఎకరాల్లో 10 వేల కోట్ల మేర పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అయితే మొత్తం తుఫాను సృష్టించిన నష్టం అంచనా వేసేందకు కేంద్ర బృందాన్ని పంపించాలని .. ఈ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణిస్తే బాధితులకు ఉపశమనం కలుగుతుందన్నారు చంద్రబాబు
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఆవేదనను కలిగించాయి. చేతికందిన పంట నీట మునిగిన వేళ, రైతుల కష్టం చూస్తే బాదేస్తోంది. కౌలు రైతులు మరింత కుదేలయ్యారు. ప్రభుత్వం వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలి. అన్నదాతకు పరిహారంపై ఉదారంగా వ్యవహరించాలి. గ్యారెంటీ లేకుండా పోయిన రైతన్నకు… pic.twitter.com/vNBPgz6zVY
ఇవి కూడా చదవండి— N Chandrababu Naidu (@ncbn) December 8, 2023
మిచౌంగ్ తుఫాన్ 15 జిల్లాల్లోని రైతులను నిట్టనిలువున ముంచెత్తింది. రైతన్న కంట కన్నీరు మిగిల్చింది. తుఫాను దాటికి చేతి కొచ్చిన పంటలు నీట మునిగాయి. వరి, మిర్చి వంటి అనేక పంటలు మోకాలు లోతు నీటిలో మునిగిపోయి కుళ్లిపోయాయి. ఎకరాలకు లక్ష రూపాయల పెట్టుబడిపెట్టి నిలువునా నష్టపోయామంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టి పొలం మీద పెట్టుబడి పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు రైతులు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..