Good News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు.. వివరాలు చెక్ చేసుకోండి
Railway Passenger Alert: ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక భూమిక పోషిస్తున్నాయి. భారత రైల్వేస్ నిత్యం లక్షలాది మంది భక్తులను ఒకచోటి నుంచి మరోచోటికి చేరవేస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Railway Passenger Alert: ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక భూమిక పోషిస్తున్నాయి. భారత రైల్వే శాఖ (Indian Railways) నిత్యం లక్షలాది మంది భక్తులను ఒకచోటి నుంచి మరోచోటికి చేరవేస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల శ్రీవారి భక్తులకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సెప్టెంబర్ మాసంలో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లు నడపనుంది. వికారాబాద్, గుంతకల్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (నెం.07489) ఈ నెల 06, 13, 20, 27 తేదీల్లో (మంగళవారం) సాయంత్రం 06.15 గం.లకు హైదరాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సులేహల్లి, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పీఆర్వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు.




One-way special trains for Tirupati Pilgrims @drmsecunderabad @drmhyb @drmgtl pic.twitter.com/lVsTGoouk1
— South Central Railway (@SCRailwayIndia) September 5, 2022
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..
