Andhra Pradesh: రావులపాలెం కాల్పుల ఘటనలో ట్విస్ట్.. ఘటనా స్థలంలో బ్యాగ్.. ఓపెన్ చేసి చూస్తే షాక్..!

Andhra Pradesh: రావులపాలెం కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది.

Andhra Pradesh: రావులపాలెం కాల్పుల ఘటనలో ట్విస్ట్.. ఘటనా స్థలంలో బ్యాగ్.. ఓపెన్ చేసి చూస్తే షాక్..!
Ravulapalm
Follow us

|

Updated on: Sep 05, 2022 | 2:25 PM

Andhra Pradesh:  అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. దుండగులు వదిలివెళ్లిన బ్యాగులో జామర్‌తో పాటు మెడికల్‌ షాప్‌ కవర్‌ను గుర్తించారు. దీంతో పాటు నాటుబాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. బాంబులతో పాటు లాఫింగ్‌ గ్యాస్‌, సిరంజీలు, ఫోన్‌ జామర్‌ కూడా బ్యాగులో దొరికింది.

ఈ క్లూస్‌ని పరిశీలించిన పోలీసులు.. రాజమండ్రిలోని ఓ మెడికల్‌ షాష్‌లో సిరంజీలు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. వీటిని ఎవరు కొనుగోలు చేశారు? ఎందుకు కొనుగోలు చేశారు? లాఫింగ్‌ గ్యాస్‌తో పనేంటి? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. రాజమండ్రికి స్పెషల్‌ టీమ్‌లను పంపారు. కవర్‌ దొరికిన మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసింది ఎవరు? అనే వివరాలను తెలుసుకుంటున్నారు. అయితే, నిన్న రాత్రి జరిగిన ఎటాక్‌కి స్నేహితులో, బిజినెస్‌ పార్ట్‌నర్సో కారణం కాదు అని ఆదిత్య రెడ్డి చెప్తున్నారు. పదిరోజుల నుంచి రెక్కీ నిర్వహించి అటాక్‌ చేశారనే అనుమానం ఉందని అంటున్నారు.

తుపాకీతో ఇద్దరు వ్యక్తులు వచ్చారు.. జామర్‌ ఉంది.. నాటు బాంబులు కూడా తెచ్చారు..ఇంత పక్కాగా ఎటాక్‌కి వచ్చిందెవరు..? దీని వెనుక 6 నెలల క్రితం మారేడుమిల్లిలో జరిగిన గొడవే కారణమా..? నాటి చిన్న కార్ యాక్సిడెంట్‌ గొడవకు ఈ కేసుతో లింకుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆదిత్య బావ చైతన్య రెడ్డి కీలక వివరాలు వెల్లడించాడు. గతంలో గ్రేహౌండ్స్‌ పోలీస్‌తో గొడవ జరిగిందని చెప్పాడు. ఆదిత్య కారు ఓ గ్రేహౌండ్స్‌ పోలీస్‌ కార్‌ మిర్రర్‌కు తగడలంతో గొడవ జరిగిందన్నాడు. అప్పుడు 40 మంది ఎటాక్‌ చేశారని ఆదిత్య బావ చైతన్య రెడ్డి తెలిపారు. జామర్‌, గన్‌ చూస్తుంటే నిన్నటి ఎటాక్‌ వెనుక పోలీసులు ఉన్నారేమోనని ఆదిత్య కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రావులపాలెం ఎటాక్‌లో త్రిశూలవ్యూహం.. రావులపాలెం ఎటాక్‌లో త్రిశూల వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు పోలీసులు. ముందుగా గన్‌తో కాల్పులు, తర్వాత బాంబులతో దాడులు.. అదీ మిస్ అయితే లాఫింగ్ గ్యాస్‌తో చంపాలనుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇంతలా ఆదిత్య రెడ్డిపై కక్ష కట్టింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రావులపాలెంకు చెందిన ఫైనాన్సియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డి పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు తుపాకీతో దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఫైనాన్షియర్ తిరగబడి ఎదిరించటంతో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ కాల్పుల శబ్ధానికి చుట్టుపక్కల వాళ్లు రావడంతో నాటుబాంబుల బ్యాగ్ అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..