OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఈసారి ఆ బ్యానర్ పై..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఓజీ. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియాంకి అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వె్ల్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

OG 2 సినిమా చేతులు మారుతుందా..? సీక్వెల్‌కు నిర్మాతలు మారిపోతున్నారా..? డివివి దానయ్య ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాకుండా.. సుజీత్ హోమ్ బ్యానర్‌కు ఈ సినిమా వెళ్లిపోయిందా..? పవన్ సినిమా వెనక జరుగుతున్న ఆ స్టోరీ ఏంటి..? నిర్మాతలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలేంటి ఈ ఓజి కహానీ..? పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఏళ్ళ తర్వాత అసలైన కిక్ ఇచ్చిన సినిమా ఓజి. అందుకే సుజీత్ అన్నా.. ఓజి యూనివర్స్ అన్నా ఫ్యాన్స్‌కు అంత రెస్పెక్ట్. ఆ సినిమా నిర్మించిన DVV దానయ్యపై కూడా అంతే కృతజ్ఞతతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. OG 2 కూడా ఇదే బ్యానర్‌లో ఉంటుందనుకున్నారంతా.. కానీ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయిప్పుడు. నిజం చెప్పాలంటే ఓజితో పాటు సుజీత్‌కు డివివి దానయ్య బ్యానర్‌లో మరో సినిమా కాంట్రాక్ట్ కూడా ఉంది. నానితో చేయాల్సిన సినిమా అదే. కానీ OG రిలీజ్ తర్వాత ఈ సినిమా చేతులు మారింది. సుజీత్ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి తన సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు నాని.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు.. ఇది పూర్తి కాగానే సుజీత్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. దీనికి బ్లడీ రోమియో టైటిల్ ప్రచారంలో ఉంది. దీని తర్వాత OG 2 వర్క్ మొదలు పెట్టనున్నారు ఈ డైరెక్టర్. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్ కాకుండా.. యువీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. సుజీత్‌కు ఇది హోమ్ బ్యానర్ లాంటిదే. సుజీత్ దర్శకుడిగా పరిచయమైన రన్ రాజా రన్, ఆ తర్వాత చేసిన సాహో సినిమాలు నిర్మించింది యువీ క్రియేషన్సే. పైగా ఓజి సినిమాలో సాహో కనెక్షన్ కూడా ఉంది. సీక్వెల్ చేస్తే ప్రభాస్, పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీలైనంత త్వరగా ఓజి యూనివర్స్‌లోకి రావాలని చూస్తున్నారు పవర్ స్టార్.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‌గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
