Andhra Pradesh: పొలంలో ఫ్లెక్సీ మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఐపీఎస్.. అసలు ఏమైందంటే..
నగదు పోయింది, నగలు పోయాయి లేదా మొబైల్ పోయింది ఇలాంటి ఫిర్యాదులను మనం తరచూ చూస్తుంటాం. మిస్సింగ్ కేసులైతే ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరైనా మిస్సైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కాని పొలంలో పెట్టిన ఫ్లెక్సీ పోయిందని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులకు..

Andhra Pradesh: నగదు పోయింది, నగలు పోయాయి లేదా మొబైల్ (MObile) పోయింది ఇలాంటి ఫిర్యాదులను మనం తరచూ చూస్తుంటాం. మిస్సింగ్ కేసులైతే ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరైనా మిస్సైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కాని పొలంలో పెట్టిన ఫ్లెక్సీ పోయిందని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు అందింది. సాధారణంగా అయితే ఫ్లెక్సీ పోయిందని ఫిర్యాదు చేస్తే పెద్దగా పట్టించుకోరు.. కాని ఫ్లెక్సీ పోయిందని ఫిర్యాదు రాగానే పోలీస్ యంత్రాంగం కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. ఫ్లెక్సీ మిస్సింగ్ పై ఇంత వేగంగా దర్యాప్తు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఇంతకీ ఫిర్యాదు ఇచ్చింది ఎవరో తెలుసా.. మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన జెడి.లక్ష్మినారాయణ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. వ్యవసాయం పై మక్కువతో మాజీ జెడి.లక్ష్మినారాయణ సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరినాట్లు వేశారు. గత కొనేళ్లుగా ఈవ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుని సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. దీనిలో భాగంగా తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి తన పంట పొలంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ కనబడటం లేదు. దీంతో తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మిస్సైందని మాజీ జెడి.లక్ష్మినారాయణ ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించారు.
మాజీ జెడి.లక్ష్మినారాయణ పొలంలో కాపలా ఉన్న దొరబాబు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ప్రత్తిపాడు సీఐ కిషోర్ బాబు లక్ష్మినారాయణకు హామీ ఇచ్చారు. మాజీ జేడీ లక్ష్మినారాయణ పొలంలో ఫ్లెక్సీ ఎందుకు మిస్ అయింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించారా, లేదా ఆకతాయిలు ఎవరైనా ఫ్లెక్సీ ఎత్తుకెళ్లారా అనే విషయాలు పోలీసుల విచారణ తేలనున్నాయి. అయినా ఫ్లెక్సీ మిస్సింగ్ పై మాజీ జెడి.లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారంటే ఇది ఎవరో కుట్రపూరితంగా చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తంమీద ఫ్లెక్సీ మిస్సింగ్ పై ఫిర్యాదు ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.





Ex Cbi Jd Laxminarayana
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..