Tirumala: ‘TTD సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు’.. కన్నీటి పర్యంతమైన నటి

తిరుమల కొండపై బాలీవుడ్‌ నటి అర్చనాగౌతమ్‌ చేసిన రచ్చ.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై సీఎం ఆఫీసు కూడా ఆరా తీస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?

Tirumala: 'TTD సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు'.. కన్నీటి పర్యంతమైన నటి
Archana Gautam
Follow us

|

Updated on: Sep 05, 2022 | 9:17 PM

Tirumala Balaji Temple:  ఉత్తరాది నటి అర్చనగౌతమ్‌ ఏడుకొండలపై చేసిన రచ్చ.. వివాదానికి దారితీసింది. బాలీవుడ్‌ సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తూ సెలబ్రిటీగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అర్చన.. కేంద్రమంత్రి సిఫార్సు లెటర్‌తో… వినాయకచవితి రోజున వెంకణ్ణ దర్శనానికి వచ్చింది. అయితే, టీటీడీ సిబ్బంది అడ్డుకోవడంతో గొడవకు దిగింది అర్చన అండ్‌ టీమ్‌. అంతేకాదు, తమను డబ్బులు డిమాండ్‌ చేశారనీ, అనుచితంగా ప్రవర్తించారనీ ఆరోపిస్తూ… సోషల్‌ మీడియాలో ఏడుస్తూ వీడియోలను రిలీజ్‌ చేసింది అర్చన. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

వ్యవహారం సామాజిక మాద్యమాల్లో మార్మోగుతుండటంతో.. టీటీడీ రంగంలోకి దిగింది. అసలు జరిగింది ఇదీ… అంటూ క్లారిటీ ఇచ్చింది. అర్చనతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు.. కేంద్ర మంత్రి సిఫార్సుతో దర్శనం కోసం వచ్చారనీ.. అయితే, అప్పటికే గడువు ముగిసిపోవడంతో సిబ్బంది అనుమతించలేదని తెలిపింది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు మంజూరు చేస్తామని చెప్పినా వినిపించుకోలేదని వివరించింది. సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ… టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి అవాస్తవాల్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..