Andhra Pradesh: నాగసాధువులు చెప్పింది నిజమవ్వాలి.. తన ఆకాంక్షలను వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి..
Andhra Pradesh: తాను మంత్రిని అవుతానని నాగసాధువులు చెప్పిన జోస్యం నిజమవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Andhra Pradesh: తాను మంత్రిని అవుతానని నాగసాధువులు చెప్పిన జోస్యం నిజమవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ ఎమ్మెల్యేకైనా మంత్రి అవ్వాలనే కోరిక ఉంటుందని, తనకు కూడా ఆ కోరిక ఉందన్నారు. మంత్రి అవాలన్న నాగ సాధువుల ఆశీర్వాదం తన అభిమానుల్లో ఉత్సాహం నింపిందన్నారు. కాశీలో ఉండే నాగసాధువులు ఘాట్‌కి రావడం, ఏర్పాట్లను మెచ్చుకోవడం సంతోషం కలిగించిందన్నారు. రెండ్రోజుల క్రితం కోటంరెడ్డి ప్రెస్‌మీట్‌లోకి వచ్చిన కొందరు నాగసాధువులు.. మిమ్మల్ని మంత్రి పదవి వరించడం ఖాయమంటూ కోటంరెడ్డికి ఆశీర్వాదమందించారు. దీంతో వారికి నమస్కరించి కాసేపు వారితో మాట్లాడారు కోటంరెడ్డి.
వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూర్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి ఆశించినట్లు పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. అయితే, సామాజిక సమీకరణలు, రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. అయితే, మరోమారు వైసీపీ ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ శ్రేణుల్లో నిండైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే.. వచ్చే ప్రభుత్వంలోనైనా తనకు మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
