Tiger Cubs: తల్లికి దూరమైన పులి పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా..? రోజూ వాటికి ఏం తినిపిస్తున్నారంటే..

అప్పుడు తల్లికి దూరమయ్యాయి.. తల్లడిల్లిపోయాయి. ఎంత వెతికినా అమ్మ జాడ కనిపించలేదు. ఎదురుచూపులే మిగిలాయి.. బిక్కుబిక్కుమంటూ గడిపాయి. కానీ ఇప్పుడవి భలే అల్లరి చేస్తున్నాయి. వేటాడేందుకు సిద్ధంగా ఉన్నంత జోష్‌తో సందడి చేస్తున్నాయి. బాధను మరిచాయి. బాగా తింటున్నాయి.. బరువు పెరిగాయి.

Tiger Cubs: తల్లికి దూరమైన పులి పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా..? రోజూ వాటికి ఏం తినిపిస్తున్నారంటే..
Tiger
Follow us

|

Updated on: Mar 30, 2023 | 8:50 AM

అప్పుడు తల్లికి దూరమయ్యాయి.. తల్లడిల్లిపోయాయి. ఎంత వెతికినా అమ్మ జాడ కనిపించలేదు. ఎదురుచూపులే మిగిలాయి.. బిక్కుబిక్కుమంటూ గడిపాయి. కానీ ఇప్పుడవి భలే అల్లరి చేస్తున్నాయి. వేటాడేందుకు సిద్ధంగా ఉన్నంత జోష్‌తో సందడి చేస్తున్నాయి. బాధను మరిచాయి. బాగా తింటున్నాయి.. బరువు పెరిగాయి. ఒంటరిగా బతకడం నేర్చుకున్నాయి. తల్లికి దూరమైనా..తిరుపతి జూలో ఆడుకుంటూ అందరినీ మురిపిస్తున్నాయి. చిట్టి తల్లులు ఎంత ముద్దుగా ఉన్నాయో..ఎంత బాగా అల్లరి చేస్తున్నాయో.. ఈ పులికూనలను గుర్తుపట్టారా..? మూడు వారాల క్రితం నల్లమల ఫారెస్ట్‌లో తల్లికి దూరమై ఒంటరైన నాలుగు పులిపిల్లలు.. ఇప్పుడు తిరుపతి జూలో ఇలా ఆడుకుంటున్నాయి.

నంద్యాల జిల్లా నల్లమల ఫారెస్ట్‌లో 20 రోజుల క్రితం తల్లితో వెళ్తూ తప్పిపోయాయి. తల్లి దూరమై..ప్రేమ కరువై..ఆదరణ దొరక్క..అల్లాడిపోయిన చిట్టి పులి కూనలు ఎంత తల్లడిల్లిపోయాయో.. మాట రాకపోయినా..మౌనంతోనే మనసులో బాధ చెప్పేశాయి. వాటిని తల్లి దగ్గరకు చేర్చడానికి అప్పుడు అటవీ శాఖాధికారులు ఎంత ప్రయత్నించారో తెలియంది కాదు..చిన్న పిల్లల్లాంటి పులి బిడ్డలను గంపలో వేసుకుని అర్దరాత్రి అడవి మొత్తం గాలించారు.. అయినా తల్లి జాడ దొరకలేదు. పులి కూనల బాధ ఆగలేదు..అప్పుడు వాటి వయసు తక్కువ.. బరువు కూడా నాలుగు కిలోల లోపే.. భయం భయంగా..బిక్కుబిక్కుమంటూ ఉండేవి.. అటవీ సిబ్బంది ఇచ్చిన పాలు కూడా సరిగా తాగేవి కాదు ..నాలుగు పులి కూనలు ఒకేచోట కూలబడేవి.. వాటి బాధ చూడలేక.. అటవీ అధికారులు తల్లీ బిడ్డలను కలపాలనుకున్నారు. అందుకోసం చాలా శ్రమించారు..అయినా టైగర్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ కాలేదు.

Tigers

Tigers

20 రోజుల క్రితం తిరుపతి జూకి తరలింపు

దీంతో 20 రోజుల క్రితం.. నాలుగు పులి పిల్లలను తిరుపతి జూకి తరలించారు. మరి అక్కడ అవి ఎలా ఉన్నాయి. తల్లి లేకుండా ఎలా ఉండగలుగుతున్నాయి. వాటి ఎదుగుదల ఎలా ఉంది. అసలు హెల్త్‌ ఎలా ఉందోనని తెలుసుకోవడానికి టీవీ9 తిరుపతి జూకు వెళ్లింది.. అక్కడికెళ్లి చూడగా.. ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయో..తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలో ఇలా అల్లారుముద్దుగా పెరుగుతున్నాయి. బ్రహ్మాండమైన ఆరోగ్యంతో ఉన్నాయి. జూకి వచ్చినప్పుడు ఒక్కో పులికూన బరువు నాలుగు కిలోల్లోపే.. ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గరదగ్గర ఏడున్నర కిలోలకు చేరుకున్నాయి.. నాలుగు పులి పిల్లలను ప్రత్యేక కోడ్ ఇచ్చి వాటిని అబ్జర్వ్‌ చేస్తూ సంరక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో..

తిరుపతి జూలోని వెటర్నటీ హాస్పిటల్ లోనే క్వారెంటెన్ బ్లాక్ ను సెట్‌ చేశారు. అచ్చంగా అటవీ ప్రాంతం అనుభూతి కలిగేలా..పులి కూనలకు ఫారెస్ట్‌ పొజిషన్‌ అలవాటయ్యేలా సెటప్‌ చేశారు. వీటి సంరక్షణకయ్యే ఖర్చులు భరించేందుకు కూడా దాతలు ముందుకు వస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. పులి పిల్లలు ఉన్న చోట..పచ్చదనం ఉట్టిపడేలా వాల్ స్టిక్కరింగ్, చల్లని వాతావరణం, ఉడెన్, స్టోన్ స్ట్రక్చర్స్ ఏర్పాటు, అటవీ ప్రాంతంలో జంతువులు, పక్షుల శబ్దాలతో బ్లాక్ ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అమర్చి పర్యవేక్షణ నిర్వహిస్తోంది.

100 గ్రాముల బాయిల్డ్ చికెన్ .. 20 గ్రామల బాయిల్డ్‌ లివర్

ఒక్కో పులి పిల్లకు 100 గ్రాముల బాయిల్డ్ చికెన్, 20 గ్రాముల బాయిల్డ్ లివర్ తోపాటు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించిన మిల్క్ పౌడర్ మిక్స్ ను మోతాదుకు తగ్గట్టుగా ఇస్తున్న జూ సిబ్బంది..వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. వాక్సినేషన్‌ కూడా ఎప్పటికప్పుడు వేయిస్తున్నారు.

అయితే ఈ మెనూ మొత్తం జస్ట్‌ సిక్స్‌ మంథ్స్‌ ఓన్లీ.. ఆర్నెల్ల వరకు రా మీట్‌ పెట్టకూడదు.. అందుకే ఇప్పుడు డైలీ ఉడికించిన మాంసం పెడుతున్నారు. ఆరు నెలల వయసు వచ్చాక మాత్రం రామీట్‌ పెట్టాలంటున్నారు. పులి కూనల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా హెల్త్ కమిటీని నియమించి వారిచ్చే సూచనల మేరకే పులి పిల్లల ఆలనా పాలనా కొనసాగుతోంది.

దత్తత తీసుకునేందుకు ఆసక్తి..

ఈ బుజ్జికన్నల అడాప్షన్ కోసం హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ సంప్రదించినట్టు జూ అధికారులు చెబుతున్నారు. పులి పిల్లలు ఉన్న ఈ క్వరంటైన్‌ బ్లాక్‌కు 5 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. జూ వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ అరుణ్ తో పాటు పులి పిల్లలకు ఆహారం అందించేందుకు ఇద్దరు అనిమల్ కీపర్స్, క్వారెంటైన్ బ్లాక్ ను క్లీన్ చేసేందుకు మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు.

పులి పిల్లలున్న క్వారెంటైన్ బ్లాక్ చుట్టూ గ్రీన్ మెస్ తో కవర్ చేయడంతో పాటు సూర్య కిరణాలు, గాలి వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసిన జూసిబ్బంది సహజసిద్ధమైన అటవీ ప్రాంత వాతావరణం ఉండేలా నిర్మించుకున్నారు. ఇప్పుడు తల్లి లేకపోయినా అలవాటైపోయింది. 20 రోజుల క్రితం ఎలా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తే.. షాకవ్వాల్సిందే.. ఆర్నెళ్ల తర్వాత వాటిని ఫారెస్ట్‌లో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఏదేమైనా..తల్లి ప్రేమకు నోచుకోక..బిడ్డలన్నీ ఒకేచోట కొలువుతీరాయి..అయినా సంతోషంగా గడుపుతున్నాయి. ఇంకో నెల తర్వాతచూస్తే.. ఇవేనా అప్పుడు తప్పిపోయినవి అని మనకే అనిపిస్తుంది. నాడు బిక్కుబిక్కు మంటూ ఎంత తల్లడిల్లిపోయాయో..నేడు అంతకుమించి అల్లరి చేస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?