Sri Rama Navami: రెండో భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం.. ఇక్కడ తలంబ్రాల కోసం ఎదురుచూసే సంతానం లేని దంపతులు

శ్రీ రామ నవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణం కోసం ఉపయోగించే తలంబ్రాల బియ్యాన్ని ఇచ్చి.. ఆ రోజంతా ఉపవాస దీక్షను చేపట్టాలి.  కళ్యాణం తిలకించి స్వామివారి కల్యాణం అనంతరం తలంబ్రాల బియ్యాన్ని పరమాన్నం గా వండి.. దానిని దంపతులు  భుజిస్తే పిల్లల కలుగుతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం.

Sri Rama Navami: రెండో భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం.. ఇక్కడ తలంబ్రాల కోసం ఎదురుచూసే సంతానం లేని దంపతులు
Gollala Mamidada
Follow us

|

Updated on: Mar 30, 2023 | 8:00 AM

శ్రీరామ నవమి వేడుకలకు గొల్లల మామిడాడ ముస్తాబైంది. రెండో భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణం చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.  ఏళ్ల నాటి ఒక గ్రామం ఆ గ్రామంలో ఇద్దరి పట్టుదల కృషితో ఎవరి సహాయ సహకారాలు ఆశించకుండా ఒక పెద్ద గాలి గోపురాల దేవాలయాన్ని నిర్మించారు. 1989 కొయ్యలతో కోలం రూపంలో వెలిసిన దేవతామూర్తులని 1932 వెంకట రమణాచార్యుల ఆలోచనలతో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి కలసి 1934లో తూర్పు పశ్చిమ గోపురం లతో కనిపించే విధంగా ఈ గుడిలో శ్రీ కోదండ రామచంద్ర దేవాలయానికి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 25 కిలోమీటర్లు రాజమహేంద్రవరానికి 45 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ లో ఈ ఆలయాన్ని నిర్మించారు.

గొల్లల మామిడాడకు పేరు ఎలా వచ్చింది.. 

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు యాదవులు ఎక్కువ నివసించే వారిని దానికి తోడు పచ్చటి పంట పొలాల మధ్య ఈ గ్రామం ఏర్పడడంతో మామిడి చెట్లు అధికంగా ఉండడంతో గొల్లల మామిడాడ అని నామకరణం చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో మామిడాడలో భూమంచి రెడ్ల సంఖ్య ఎక్కువ పెరిగింది.

ఇవి కూడా చదవండి

1989లో చిన్న ఆలయంగా నిర్మించిన 1934లో విగ్రహ ప్రతిష్ట జరిగిన అనంతరం భక్తులు తాకిడి పెరిగింది. తూర్పు గోపురం 160 అడుగులు ఎత్తుతో, పశ్చిమ గోపురం 210 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో శిల్పకళానైపుణ్యంతో నిర్మించారు.9వ అంతస్తులు తూర్పు గుమ్మానికి పై భాగాన శ్రీరామ పట్టాభిషేకం, ఎనిమిదవ అంతస్తులో నలుమూలల 12 హంసలు, సప్తమాత్రికలు, ఉత్తరాన అష్టవశువుల శిల్పాలను ఎంతో హృదయంగా నిర్మించారు. ఏడవ అంతస్తు పై పుష్ప భాను యాత్రను, ఆరవ అంతస్తు పై తాను మన్ను తినలేదంటూ చిన్ని కృష్ణుడు నోరు తెరచి బ్రహ్మాండాన్ని చూపించి, ఐదవ అంతస్తు పై శంఖం పూరిస్తున్న రుసీస్వర్ల శిల్పాలను చెక్కి సూపర్ లను ఆకట్టుకున్నారు.

అద్దాల మందిరం..

ఈ ఆలయానికి వచ్చే భక్తులకు గాలి గోపురానికి ప్రవేశించేముందు బాల గణేష్ ని దర్శించి అద్దాల మందిరాన్ని వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి గోడలకు అద్దాలను అమర్చి ఎక్కువ ప్రతిబింబాలను చూసుకునే విధంగా సీతారాముల విగ్రహాలను నిర్మించి, దశ ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు హనుమంతుడు సమేత శ్రీరామచంద్రమూర్తి,పలు ఉపాలయాలను సన్నిధిలో నిర్మించారు.

సంతానం లేని భక్తులకు  

శ్రీ రామ నవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణం కోసం ఉపయోగించే తలంబ్రాల బియ్యాన్ని ఇచ్చి.. ఆ రోజంతా ఉపవాస దీక్షను చేపట్టాలి.  కళ్యాణం తిలకించి స్వామివారి కల్యాణం అనంతరం తలంబ్రాల బియ్యాన్ని పరమాన్నం గా వండి.. దానిని దంపతులు  భుజిస్తే పిల్లల కలుగుతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం.

ద్వారంపూడి వంశీకులే ఇప్పటికీ ధర్మకర్తలు

సుమారు వంద సంవత్సరాలు పూర్తి చేసు కుంటున్న ఈ ఆలయానికి అప్పట్లో నిర్మించిన ద్వారంపూడి వంశీకులే ఆలయ ధర్మ కర్తలు. గత నాలుగు తరాలుగా వారి కుటుంబీకులైన ద్వారంపూడి శ్రీను మురళీకృష్ణ రెడ్డి ఆలయానికి అన్నీ తానై భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చూస్తున్నారు.

వైభవంగా సీతారాముల కళ్యాణం: 

ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 1934లో శ్రీరామనవమి రోజున విగ్రహ ప్రతిష్ట చేసి అత్యంత వైభవంగా గాలిగోపురాలు నిర్మించి, ఒక్కొక్క అంతస్తులు ఒక్కొక్క ఇతిహాస ఘట్టాన్ని, శోభాయమానంగా మలిచారు. గొల్లల మామిడాడ లో శిల్పకళా నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.. భక్తులకు ఆకట్టుకునే విధంగా రూపొందించి ఆలయాన్ని నిర్మించారు. అద్దాల మందిరాలతో భక్తులకు ఆశ్చర్యపరిచే విధంగా తీర్చిదిద్దారు.

ప్రతి ఏటా సీతారాముల కల్యాణోత్సవాలను కన్నులారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. తెల్లవారుజామున పుష్కరి నుంచి తీర్ధాన్ని సేకరించి ఆ తీర్థంతో స్వామివారికి అభిషేకాన్నీ నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువవస్తారు. సీతారాముల కళ్యాణానికి శ్రీరామ లికిత కళ్యాణ తలంబ్రాలు, మంచి ముత్యాలతో , తొమ్మిది రకాల పళ్ళతో, తొమ్మిది రకాల పుష్పాలతో ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీమత్ హనుమత్ సమేత సీతారామచంద్రస్వామి కోదండరామ ఆలయంలో నిర్మించి సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దపెద్ద చదువు పందిళ్లు నిర్మించి భద్రాద్రి తర్వాత అంతటి వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను జరిపే ఆలయం గొల్లలమామిడాడలోని ప్రతీతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..