Andhra Pradesh: అయ్యో పాపం.. పెళ్లైన కొద్ది నెలలకే డెంగ్యూతో నవ వధువు మృతి

డాక్టర్ల సూచనలతో ఏమాత్రం ఆలోచించని కుటుంబ సభ్యులు హరిచందనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కానీ అప్పటికే హరి చందన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఎన్ని రోజుల నుంచి చికిత్స అందించిన ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే ఆమె మృతి చెందింది.

Andhra Pradesh: అయ్యో పాపం.. పెళ్లైన కొద్ది నెలలకే డెంగ్యూతో నవ వధువు మృతి
Newly Married Women Passed Away with dengue
Follow us
M Sivakumar

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2023 | 1:45 PM

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు.. పెళ్లయి కనీసం ఐదు నెలలు కూడా పూర్తికాలేదు. కానీ అప్పటికే అనంత లోకాలకి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఏంటో మాయదారి డెంగ్యూ జ్వరం అన్యాయంగా హరి చందన నాను అనంత లోకాలకు తీసుకువెళ్లిపోయింది.. ఇరు కుటుంబాలలో కన్నీళ్లను మిగిలిచ్చింది. అనారోగ్య సమస్యలతో ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.. విష జ్వరాలు మొదలు డెంగ్యూ వరకు అన్ని ప్రాణాలు తీస్తున్నాయి. వృద్ధులనే కాదు చిన్న , మధ్య వయసులో ఉన్న వారిని కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి మాయదారి జ్వరాలు.. వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందుతున్నారు.. తాజాగా 23 ఏళ్ల హరిచందన డెంగ్యూ కారణంగా మృతి చెందింది.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన హరిచందన కు ఖమ్మం జిల్లా వైరకు చెందిన రాజేష్ అనే యువకుడితో ఈ ఏడాది మే 30న వివాహం జరిగింది. కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు వధువు కుటుంబ సభ్యులు. ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగు పెట్టింది హరిచందన .. అత్తమామలు కూడా కన్న కూతురులా చూసుకున్నారు. కట్టుకున్న భర్త ప్రాణంగా ప్రేమించాడు. అలా సాఫీగా సాగుతున్న కుటుంబంలో విషాదం నెలకొంది..

ఎంతో సంతోషంగా ఉన్నా హరి చందన డెంగ్యూ జ్వరం బారిన పడింది. తొలుత వాతావరణం మార్పు తో వచ్చిన జ్వరం అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించారు. దీంతో వైద్యులు డెంగీ వచ్చినట్లుగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ల సూచనలతో ఏమాత్రం ఆలోచించని కుటుంబ సభ్యులు హరిచందనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కానీ అప్పటికే హరి చందన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఎన్ని రోజుల నుంచి చికిత్స అందించిన ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే ఆమె మృతి చెందింది.

ఎలా అయినా సరే ఆరోగ్యంగా హరిచంద్ర తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు భావిచారు.. కానీ డెంగ్యూ జ్వరం నవ వధువు హరిచందనను పొట్టను పెట్టుకుంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో