AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమికి పొంచివున్న ప్రమాదం..! అతి త్వరలోనే కోట్లాది మందిని కాల్చేసే కార్చిచ్చు..? కారణం ఏంటో తెలుసుకోండి..

ప్రపంచం అత్యంత వేడిగా ఉన్న సెప్టెంబర్‌ను ఎదుర్కొన్న తరుణంలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో సగటు ఉపరితల ఉష్ణోగ్రత 16.38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అత్యంత భయానక విషయమేమిటంటే, దీని తరువాత కూడా, ప్రజలు పర్యావరణంపై శ్రద్ధ చూపకపోవడం చాలా ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు చెబుతున్నారు.

భూమికి పొంచివున్న ప్రమాదం..! అతి త్వరలోనే కోట్లాది మందిని కాల్చేసే కార్చిచ్చు..? కారణం ఏంటో తెలుసుకోండి..
Climate Change
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2023 | 1:02 PM

Share

భవిష్యత్తులో భూమిపై ఎక్కువ భాగం విపరీతమైన వేడిగా మారుతుంది. అక్కడ మనుషులు నివసించడం సాధ్యం కాదు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు నివసించే ప్రాంతంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి, అక్కడి ప్రజలు చల్లటి ప్రదేశాలకు వలస వెళ్ళవలసి వస్తుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో కలిగే నిరంతర మార్పు. భారత్‌, పాకిస్థాన్, తూర్పు చైనా, సబ్-సహారా ఆఫ్రికా దేశాలు భరించలేని వేడిని ఎదుర్కోబోతున్నాయని అమెరికాలోని పరిశోధకులు చెబుతున్నారు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ మాథ్యూ హుబెర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో భూమిపై అత్యంత వేడిగాలులు తాకుతాయని, భరించలేని వేడి కారణంగా అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందని చెప్పారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాంతాల్లో అతి తక్కువ మొత్తంలో గ్రీన్‌హౌస్, ఉద్గారాలు ఉంటాయి.

ప్రొఫెసర్ డాక్టర్ మాథ్యూ హుబెర్ ఇంకా పలు ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. ఎండ వేడిమి కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వీరిలో కోట్లాది మంది పేద ప్రజలు చనిపోతారని అన్నారు.. పేద దేశాలు మాత్రమే వేడిగాలుల ప్రభావానికి గురవుతాయని ఆయన అన్నారు. ఇది గ్రీన్‌హౌస్ వాయువులను ఎక్కువగా విడుదల చేసే సంపన్న దేశాలపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ధనిక దేశాలు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చే వేడిగాలులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కెనడా, ఐరోపాలో వేడి ప్రభావం ఇప్పటికే కనిపించింది.

ప్రపంచం అత్యంత వేడిగా ఉన్న సెప్టెంబర్‌ను ఎదుర్కొన్న తరుణంలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో సగటు ఉపరితల ఉష్ణోగ్రత 16.38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అత్యంత భయానక విషయమేమిటంటే, దీని తరువాత కూడా, ప్రజలు పర్యావరణంపై శ్రద్ధ చూపకపోవడం చాలా ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..