కేసీఆర్‌ మదిలో హుస్నాబాద్‌ సెంటిమెంట్‌.. మూడోసారి గెలుపు ధీమాతో ఎన్నికల బరిలోకి.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఫాం హౌజ్ నుండే కేసీఆర్ రోజు వారి ప్రచారాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. మూడోసారీ హుస్నాబాద్‌ సెంటిమెంట్‌తో ఎన్నికల యుద్ధం మొదలు పెట్టిన కేసీఆర్‌ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుస్నాబాద్‌లో తొలి సభతో కేసీఆర్‌ ప్రచారం ఊపందుకోనుంది. ఇక కేసీఆర్‌ పూర్తి షెడ్యూల్‌ పరిశీలించినట్టయితే...

కేసీఆర్‌ మదిలో హుస్నాబాద్‌ సెంటిమెంట్‌.. మూడోసారి గెలుపు ధీమాతో ఎన్నికల బరిలోకి.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
CM KCR
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 11, 2023 | 1:40 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. అధికారికంగా విడుదలైన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సారి కూడా హుస్నాబాద్ నుండే తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధినేతగా సభల్లో ప్రసంగించిన ఉద్యమనేత ఈ సారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉపన్యాసించనున్నారు.

ఆ రెండూ కూడా….

ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో హుస్నాబాద్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని అనుకుంటుంటాం. కానీ ఇందులో మరో కోణం కూడా దాగి ఉందన్న విషయం చాలా మంది గమనించకపోవచ్చు. ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వొడితెల సతీష్ బాబు ఫ్యామిలీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. స్వరాష్ట్ర కల సాకారం కోసం డిప్యూటీ స్పీకర్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటూ సమీకరణాలు చేసిన కేసీఆర్ కు మొదట అండగా నిలిచింది కూడా వొడితెల బ్రదర్సే. మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ రావు, కెప్టెన్ లక్ష్మీ కాంతరావులు కేసీఆర్ చేపట్టే ప్రతి వ్యూహంలోనూ ఈ అన్నదమ్ములిద్దరు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. వొడితెల రాజేశ్వర్ రావు మరణానంతరం కూడా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం అంతా కూడా కేసీఆర్ తో కలిసి నడిచింది. హుస్నాబాద్ నుండి ప్రచారాన్ని ప్రారంభించినట్టయితే అన్ని విధాలుగా సక్సెస్ అవుతామని కూడా ఆయనకు వాస్తు శాస్త్ర పండితులు చెప్పడంతో మొదట అక్కడి నుండే తన ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ కేసీఆర్ ఈ ఎన్నికల్లోనూ హుస్నాబాద్ లోనే తొలి సభ ఏర్పాటు చేస్తున్నారు. అటు ఈశాన్య ప్రాంతంగా భావించే హుస్నాబాద్ తో పాటు మరో వైపున ఉద్యమం నుండి కూడా అన్నింటా అక్కున చేర్చుకున్న వొడితెల కుటుంబానికి చెందిన సతీష్ బాబు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో కలిసి వచ్చిందని కేసీఆర్ నమ్ముతున్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అక్కడి నుండే…

అయితే, కేసీఆర్ రాష్ట్రం నలుమూలల చుట్టివచ్చేందుకు ఖరారయిన షెడ్యూల్ ను కూడా అమలు చేసేందుకు ఎర్రవెల్లి పాం హౌజ్ వేదికగానే కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫాం హౌజ్ నుండే కేసీఆర్ రోజు వారి ప్రచారాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. మూడోసారీ హుస్నాబాద్‌ సెంటిమెంట్‌తో ఎన్నికల యుద్ధం మొదలు పెట్టిన కేసీఆర్‌ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుస్నాబాద్‌లో తొలి సభతో కేసీఆర్‌ ప్రచారం ఊపందుకోనుంది. ఇక కేసీఆర్‌ పూర్తి షెడ్యూల్‌ పరిశీలించినట్టయితే…

– అక్టోబర్‌ 15న హుస్నాబాద్‌

– 16న జనగామ, భువనగిరి

– 17న సిరిసిల్ల, సిద్దిపేట

– 18న జడ్చర్ల, మేడ్చల్‌

– 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, మునుగోడు

– 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌

– 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

– 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌

– 31న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

– నవంబర్‌ 1న సత్తుపల్లి, ఇల్లందు

– 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

– 3న భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల

– 5న కొత్తగూడెం, ఖమ్మం

– 6న గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట

– 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి

– 8న సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

– 9న కామారెడ్డితో తొలి దశ ప్రచారం ముగింపు

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో