గర్భాంధకారం నుంచి అనాధగా రోడ్డుపై చేరిన ఆడశిశువు.. ప్రస్తుతం ఎలా ఉందంటే..

కుటుంబంలో ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి పుట్టింది అని పండుగ చేసుకోవలిసిన తల్లిదండ్రులు విచక్షణరహితంగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. నేటి ప్రపంచంలో మనుషులు ఎందుకు ఇలా తయారు అవుతున్నారో తెలిదు కానీ ఆనందంతో మనస్సుకు హత్తుకొవలిసిన పసికందులను అనాధలను చేస్తూ, మహిళలిచ్చే జన్మకు విలువ తీసేస్తున్నారు. పిల్లలను దేవుళ్ళుగా భావించే పవిత్ర భారత దేశంలో అనాదిగా వస్తున్న ఆచారంలా పుట్టిన ఆడ పసికందులను తల్లిదండ్రులు వదిలేస్తున్నారు.

గర్భాంధకారం నుంచి అనాధగా రోడ్డుపై చేరిన ఆడశిశువు.. ప్రస్తుతం ఎలా ఉందంటే..
Born Baby
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 13, 2024 | 10:25 AM

కుటుంబంలో ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి పుట్టింది అని పండుగ చేసుకోవలిసిన తల్లిదండ్రులు విచక్షణరహితంగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. నేటి ప్రపంచంలో మనుషులు ఎందుకు ఇలా తయారు అవుతున్నారో తెలిదు కానీ ఆనందంతో మనస్సుకు హత్తుకొవలిసిన పసికందులను అనాధలను చేస్తూ, మహిళలిచ్చే జన్మకు విలువ తీసేస్తున్నారు. పిల్లలను దేవుళ్ళుగా భావించే పవిత్ర భారత దేశంలో అనాదిగా వస్తున్న ఆచారంలా పుట్టిన ఆడ పసికందులను తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎంత కిరాతకుడికైనా పసిపిల్లలను చుస్తే జాలి మనిషిలా మారతారు. అలాంటి పుట్టిన పసికందును ఏమాత్రం ఆలోచించకుండా బయట పడేసిన ఘటన అవనిగడ్డలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా అవనిగడ్డ ఒకటో వార్డ్ క్రిస్టియన్ చర్చి సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును వదిలేసి వెళ్ళిపోయారు. ఈఘటన సోమవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. ఈలోపు అటుగా వెళ్తున్న పాస్టర్‎కు చిన్న పిల్ల ఏడుపు పెద్దగా వినిపించింది. ఏమిటా అని చూడగా అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాస్టర్ సహాయంతో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. దయనీయమైన పరిస్థితుల్లో పాపను చూసిన పాస్టర్.. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గ్రహించి అవనిగడ్డ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆ పాపను పరీక్షించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హెచ్చరిచడంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికోసం ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ