AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: తెల్లారి మద్యం షాపు ఓపెన్ చేయగా.. కళ్లెదుట దృశ్యానికి గుండె ఆగినంత పనైంది..

ఈ స్టోరీ అట్లాంటి.. ఇట్లాంటిది కాదు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. షాకింగ్‌లు ఉంటాయి. మరి లేట్ ఎందుకు లుక్కేసేద్దాం.. మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో ఏకంగా లిక్కర్ షాపులోనే చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనంగా మారింది.

AP News: తెల్లారి మద్యం షాపు ఓపెన్ చేయగా.. కళ్లెదుట దృశ్యానికి గుండె ఆగినంత పనైంది..
Liquor Shop
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 13, 2024 | 11:30 AM

Share

ఈ స్టోరీ అట్లాంటి.. ఇట్లాంటిది కాదు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. షాకింగ్‌లు ఉంటాయి. మరి లేట్ ఎందుకు లుక్కేసేద్దాం.. మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో ఏకంగా లిక్కర్ షాపులోనే చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనంగా మారింది.

నంద్యాలలో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉండే బీడీ షాపులు, వస్త్ర దుకాణాలు, దేవాలయాల్లోని హుండీలు, సెల్‌ఫోన్ షాపుల్లో చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పద్మావతి నగర్‌లో గల ప్రభుత్వ లిక్కర్ మాల్‌లో దుండగులు చోరీ చేయడం కలకలం రేపింది. దొంగలు మాల్ పైకప్పు పగలగొట్టి వాటర్ పైప్ ద్వారా కిందికి దిగి చోరి చేశారు.

ప్రభుత్వ లిక్కర్ మాల్‌లో క్యాష్ కౌంటర్‌లోని రూ.5 లక్షల నగదుతో పాటు విలువైన లిక్కర్‌ బాటిళ్లు అపహరించినట్లు మాల్ సూపర్ వైజర్ గుర్తించాడు. ఉదయం షాపు తాళాలు తీసి చూడగా చోరి జరిగిన విషయాన్ని గమనించి.. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు లిక్కర్ మాల్ చేరుకుని విచారణ చేపట్టారు. దుండగుల అనవాళ్ల కోసం క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. లిక్కర్ మాల్ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత రెండు నెలల కాలంలో వరుసగా దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ దొంగలు దొరక్కపోవడం.. ఎక్కడో ఒక చోట మరలా దొంగతనం చేస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోనే‌ ఇలాంటి పరిస్థితి ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వీడియో:

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్