ఇదేంది డాక్టర్ సాబ్.! వైద్యం చేయాల్సిందిపోయి.. మహిళా పేషెంట్‌తో పాడుపని..

అతడు పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన ఓ మహిళా పేషెంట్‌తో చనువుగా ఉంటున్నాడు. తన భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ఆమె భర్త.. ఇద్దరూ కారులో షికార్లు చేస్తుండగా పట్టుకుని నడిరోడ్డుపై నానా హంగామా చేశాడు.

ఇదేంది డాక్టర్ సాబ్.! వైద్యం చేయాల్సిందిపోయి.. మహిళా పేషెంట్‌తో పాడుపని..
Doctor Image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 13, 2024 | 10:13 AM

అతడు పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన ఓ మహిళా పేషెంట్‌తో చనువుగా ఉంటున్నాడు. తన భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ఆమె భర్త.. ఇద్దరూ కారులో షికార్లు చేస్తుండగా పట్టుకుని నడిరోడ్డుపై నానా హంగామా చేశాడు. దీంతో ఒంగోలు నడిబొడ్డులో కొద్దిసేపు కలకలం రేగింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులో ఓ డాక్టర్‌కు ఒక యువకుడు దేహశుద్ది చేశాడు. కారులో తన భార్యతో ఉండగా డాక్టర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాడు. దీంతో ఆ యువకుడితో డాక్టర్ కలబడ్డాడు. ఈ ఘర్షణలో ఇరువురూ గాయపడ్డారు. ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టకు చెందిన వెంకట్రావు అనే యువకుడు తన కొడుకు వైద్యం కోసం భార్యతో కలిసి నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న వర్షిత్‌ పిల్లల ఆసుపత్రికి వెళ్లిన సమయంలో తన భార్యను డాక్టర్ లోబర్చుకున్నాడని వెంకట్రావు ఆరోపిస్తున్నాడు. వీళ్ళిద్దరి విషయం తెలిసి పలుమార్లు హెచ్చరించినా డాక్టర్ వినకపోవడంతో.. తన భార్యను కలిసేందుకు మార్కెట్ సెంటర్‌కు వచ్చిన డాక్టర్‌ను పట్టుకున్నాడు.

కారులో తన భార్యతో మాట్లాడుతున్న డాక్టర్‌ మాధవను పట్టుకుని కారులోనుంచి బయటకు లాగాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. డాక్టర్ మాధవను వెంకట్రావు దేహశుద్ది చేస్తుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కావడంతో ఒంగోలు రిమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అవుట్‌పోస్ట్‌ పోలీసులకు ఇరువురూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

పలుమార్లు హెచ్చరించినా.. పెడచెవిన పెట్టిన డాక్టర్‌..

ఒంగోలు సమీపంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వెంకట్రావు మూడేళ్ళ క్రితం తన కొడుకుకు వైద్యం చేయించుకునేందుకు తన భార్యతో కలిసి వర్షిత్‌ పిల్లల ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్‌ మాధవ తన కొడుకుకు వైద్యం చేశాడు. ఈ పరిచయంతో తన భార్య రెండో కాన్పు కూడా అదే ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ద్వారా చేయించాడు. ఈ క్రమంలోనే డాక్టర్‌ మాధవతో వెంకట్రావు, అతని భార్యకు పరిచయం పెరిగింది. ఆ తర్వాత వెంకట్రావు భార్యతో చనువు పెంచుకున్న డాక్టర్‌ మాధవ తాను రొయ్యల సాగు చేస్తూ అక్కడ తనకు నమ్మకమైన వ్యక్తి కావాలంటూ వెంకట్రావును మేనేజర్‌గా నియమించుకున్నాడు. డాక్టర్‌ మాధవ తన కుటుంబంపై ఎంతో చనువుగా ఉండటాన్ని గమనించిన వెంకట్రావు తన భార్య ప్రవర్తనను అనుమానించాడు.

వీళ్లిద్దరూ ఫోన్లలో, వాట్సాప్‌ చాటింగ్‌లలో మాట్లాడుకుంటున్నట్టు గుర్తించాడు. భార్యను, డాక్టర్‌ను మందలించాడు. దీంతో వెంకట్రావు భార్య ఒంగోలులోని ఓ హోమ్‌కు వెళ్లి అక్కడే పిల్లలతో కలిసి ఉంటోంది. పైగా తన భర్త వెంకట్రావు తనను వేధిస్తున్నాడని దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో వీరిద్దరిపై కోపం పెంచుకున్న వెంకట్రావు.. డాక్టర్‌తో కలిసి తన భార్య కారులో మార్కెట్‌ సెంటర్‌కు రాగానే ఇద్దరిని పట్టుకుని నిలదీశాడు. వారితో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత జరిగింది తెలిసిందే.. ఇద్దరూ ఆసుపత్రిలో చేరి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్‌ తన దగ్గరకు వచ్చిన పేషెంట్‌తో సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమె కాపురం వీధిన పడింది. డాక్టర్‌ పరువు కూడా పోయింది. అందుకే అక్రమ సంబంధాలు అనర్ధాలకు దారి తీస్తాయని పెద్దలు చెబుతుంటారు.