Chandrababu Naidu: చంద్రబాబు సంచలనం నిర్ణయం.. ఇకపై అస్సలు అలా మాట్లాడరట!
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలా పడితే అలా మాట్లాడబోనని అన్నారు. అయితే, ప్రజలు మాత్రం తాను చెబుతున్న మాటలను వినాలని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆయన ఎలా మాట్లారు? ఏం మాట్లాడరు? ఇంత సడెన్‌గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలా పడితే అలా మాట్లాడబోనని అన్నారు. అయితే, ప్రజలు మాత్రం తాను చెబుతున్న మాటలను వినాలని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆయన ఎలా మాట్లారు? ఏం మాట్లాడరు? ఇంత సడెన్‌గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఇకపై ప్రజల కోసమే మాట్లాడుతానని అన్నారు. ప్రజా సమస్యలపైనే మాట్లాడుతానని పేర్కొన్నారు. ఎలాపడితే అలా మాట్లాడబోనన్నారు.
హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చెప్పను..
అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. అసలు సైబరాబాద్‌ను కట్టించింది తానే అని చెప్తుంటారు. విజన్ 2020 తో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్తుంటారు. అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు చెబుతున్న హైదరాబాద్ అభివృద్ధిపై ఆ రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నేతలు కూడా సెటైర్లు వేశారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందంటూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇకపై హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసానని చెప్పను అన్నారు. అంటే తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు అన్నారా? లేక వేరే కారణం ఉందా? అనేది తెలియదు కానీ, మొత్తానికి తాను పదే పదే చెప్పే హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడనని చెప్పడం కొంచెం కొత్తగానే కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నేను చెప్పేవి ప్రజలు గుర్తించుకోవాలి..
వైసీపీ ప్రభుత్వంపై విమర్శల ఘాటు పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇకపై సబ్జెక్టుల వారీగా ఒక్కో అంశంపై మాట్లాడాలని నిర్ణయించారు. మొదట రైతుల సమస్యలు, రైతాంగం పడుతున్న ఇబ్బందులపై మీడియా సమావేశం పెట్టారు చంద్రబాబు. వైసీపీ నేతలు ఓడిపోతారనే ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఎక్స్‌పెయిరీ డేట్ అయిపోయిందన్న చంద్రబాబు.. ఇందుకు ఏ మందు వాడాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. తాను చెప్పే ప్రతి మాటను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఇకపై ప్రతి విషయం ప్రజల కోసమే మాట్లాడతానని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే పోరాటం సాగిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..