Andhra Pradesh: భర్తకు గుడికట్టిన మహిళ.. చనిపోయినా బతికే ఉన్నాడంటూ నిత్యం పూజలు…

prakasam : భర్త మరణానంతరం కూడా బతికే ఉన్నాడన్న నమ్మకంతో అతనికి గుడికట్టి నిత్యం పూజలు చేస్తుండటాన్ని తొలుత గ్రామస్థులు వింతగా చెప్పుకున్నా... ఆ తరువాత పద్మావతి పతిభక్తికి బంధువులతో పాటు గ్రామస్థులు కూడా ప్రశంసిస్తున్నారు... భర్త బతికుండగానే నరకం చూపించే కొంతమంది మహిళలకు పద్మావతి ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సంకోచం అవసరం లేదు కదా...

Andhra Pradesh: భర్తకు గుడికట్టిన మహిళ.. చనిపోయినా బతికే ఉన్నాడంటూ నిత్యం పూజలు...
Wife Build Temple For Husba
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 25, 2023 | 5:08 PM

ప్రకాశం జిల్లా, జులై25: పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ… భర్త మరణానంతరం కూడా ఆయనను పూజిస్తూ ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి 6 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య… అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా చేస్తూ ఆదర్శ భార్యగా నిలుస్తోంది.

ప్రకాశంజిల్లా పొదిలికి చెందిన గురుగుల అంకిరెడ్డి, పద్మావతికి పదమూడేళ్ళ క్రితం వివాహమైంది… అయితే అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు 6 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. భార్య వెంకట పద్మావతి భర్తపై ప్రేమ, అభిమానంతో నిమ్మ వరం గ్రామంలో గుడికట్టింది… భర్త విగ్రహం ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తూ భర్త సేవకే అంకితమైంది . ప్రతి ఏట గురుపౌర్ణమికి ఆయన పేరుమీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుంది. భర్త మరణానంతరం కూడా పద్మావతి పతియే ప్రత్యక్ష దైవం అంటూ ఆయన పాద సేవకే అంకితం కావడం పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

పద్మావతిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు… భర్త బతికున్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునే పద్మావతి తన భర్త మరణానంతరం కూడా బతికే ఉన్నాడన్న నమ్మకంతో అతనికి గుడికట్టి నిత్యం పూజలు చేస్తుండటాన్ని తొలుత గ్రామస్థులు వింతగా చెప్పుకున్నా… ఆ తరువాత పద్మావతి పతిభక్తికి బంధువులతో పాటు గ్రామస్థులు కూడా ప్రశంసిస్తున్నారు… భర్త బతికుండగానే నరకం చూపించే కొంతమంది మహిళలకు పద్మావతి ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సంకోచం అవసరం లేదు కదా…

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..