AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: జస్ట్ స్మాల్ గ్యాప్ అంతే.. తగ్గేదే లేదు.. ఆ జిల్లాపై విజయ సాయిరెడ్డి ఫోకస్..

MP Vijaysai Reddy: మళ్లీ పార్టీలో ఆక్టివ్ కావడమే కాదు... కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్తున్నారు. వరుస సమావేశాలతో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకి కొత్త భాద్యతలు అప్పగించారు.

AP Politics: జస్ట్ స్మాల్ గ్యాప్ అంతే.. తగ్గేదే లేదు.. ఆ జిల్లాపై విజయ సాయిరెడ్డి ఫోకస్..
Vijaya Sai Reddy
S Haseena
| Edited By: Sanjay Kasula|

Updated on: Jul 25, 2023 | 2:56 PM

Share

జస్ట్ స్మాల్ గ్యాప్ అంతే… తగ్గేదే లేదంటున్నారు ఆ సీనియర్ నేత. అధికార పార్టీలో టాప్ 5 లో ఉన్నా… కొంతకాలంగా మౌనంగా ఉండటం అనేక ఆరోపణలకు దారి తీసింది. మళ్లీ పార్టీలో ఆక్టివ్ కావడమే కాదు… కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్తున్నారు. వరుస సమావేశాలతో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకి కొత్త భాద్యతలు అప్పగించారు. పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి కి ఇపుడు రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ బిజీ అయిపోయారు.

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పై రకరకాల ప్రచారం జరిగింది.. అంతే కాదు సీఎం జగన్ తర్వాత పార్టీలో టాప్ 5 లో ఉన్న విజయసాయిరెడ్డి దూరంగా ఉండటం నేతలు, కార్యకర్తల కు కూడా ఇబ్బందిగా మారిందట.. ఆ మధ్య బాలినేని వద్దని తప్పుకున్న రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు సాయిరెడ్డి కి ఇచ్చి అక్కడి పరిస్తితి చక్క దిద్దాలని సీఎం భావించారు.. అందుకే ఇపుడు ఆ కృషియల్ పదవిని సై రెడ్డి కి ఇచ్చారు.

వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో రీఎంట్రీ ఇచ్చిన విజయసాయిరెడ్డి..వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపేశారు…పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు..కేవలం మీటింగ్ కె పరిమితం కాకుండా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం పార్టీ నాయకులకు కొత్త ఊపు తెచ్చిందంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు.పార్టీ బలోపేతం చేయడం, ఖాళీగా ఉన్న పదవుల భర్తీపైనా ఆదేశాలు ఇచ్చారట ఎంపీ విజయసాయిరెడ్డి. అనుబంధ విభాగాల జోనల్ ఇంఛార్జీలు,జిల్లా ప్రెసిడెంట్స్,మండల ఇంఛార్జీల ఖాళీలు భర్తీ చేయాలని సూచించారట.

జయహో బీసీ సదస్సు మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీ ల సదస్సులు నిర్వహించేలా సూచనలు చేశారట. తిరిగి. వైసీపీ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పనిచేయాలని నేతలకు సూచించారట.మహిళా విభాగం,యువజన విభాగం పైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారట సాయి రెడ్డి.విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ తో వైసీపీలో నేతల్లో జోష్ పెరిగిందని అంటున్నారు…

మరోవైపు రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు కూడా విజయసాయిరెడ్డికి అప్పగించటం తో అక్కడ పరిస్తితులను చక్కడిద్దటం ఆయన కి పెద్ద టాస్క్ అని అంటున్నారు వైసీపీ నేతలు..అందుకే ఆ పోస్ట్ ను సీనియర్ నాయకుడు అయిన సాయి రెడ్డి కే అప్పగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం