Andhra Pradesh: వెయ్యేళ్లనాటి శివాలయంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు..

ప్రకాశం జిల్లాలో గుప్తనిదుల వేటగాళ్లు రెచ్చిపోయారు. పురాతన ఆలయాలను టార్గెట్ చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బేస్తవారిపేట మండలం సోమవారిపేట గ్రామ సమీపంలోని వెయ్యేళ్ళ పురాతన శివాలయంలో దొంగలు పడ్డారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహాలను కాకుండా ఆలయం గొడలకు ఉన్న విగ్రహాల్లో గుప్తనిదులు ఉన్నాయన్న ప్రచారంతో దొంగలు శివాలయంపై కన్నేశారు.

Andhra Pradesh: వెయ్యేళ్లనాటి శివాలయంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు..
Temple Robbery
Follow us
Fairoz Baig

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 25, 2023 | 8:48 PM

ప్రకాశం జిల్లాలో గుప్తనిదుల వేటగాళ్లు రెచ్చిపోయారు. పురాతన ఆలయాలను టార్గెట్ చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బేస్తవారిపేట మండలం సోమవారిపేట గ్రామ సమీపంలోని వెయ్యేళ్ళ పురాతన శివాలయంలో దొంగలు పడ్డారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహాలను కాకుండా ఆలయం గొడలకు ఉన్న విగ్రహాల్లో గుప్తనిదులు ఉన్నాయన్న ప్రచారంతో దొంగలు శివాలయంపై కన్నేశారు. ఆలయం ప్రహరీ గోడ పై ఉన్న ఓ శిల్పాని గత కొన్ని రోజులుగా రెక్కీ చేసి మరీ ఎత్తుకెళ్ళారు. దొంగతనం చేసేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న దొంగలు కొద్దిరోజులు ముందు ఆలయాన్ని సందర్శించి శిల్పానికి సంబంధించిన ప్రాంతంలో చిన్నటి రంధ్రాలు వేసి పాదరసాన్ని పోశారు.

ఈ విషయాన్ని ఆలయ నిర్వహకులు గమనించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిగా రోజుల తరువాత దొంగలు మరోసారి ఆలయాన్ని సందర్శించి సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి శిల్పాన్ని దొంగలించి తీసుకువెళ్లారు. దొంగిలించిన శిల్పంలో పూర్వం గుప్త నిధులు ఉంచారని అర్చకులు అంటున్నారు. గతంలో కూడా ఇటువంటి శిల్పాలను దొంగిలించిన చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. దొంగలు శిల్పాన్ని దొంగిలించిన తర్వాత ఆ ప్రాంతాన్ని సిమెంట్ తో ప్లాస్టింగ్ కూడా చేశారు. దొంగిలించిన శిల్పాన్ని ఆలయ సమీపంలోని పొలాలలోకి తీసుకువెళ్లి పగలగొట్టి అందులో ఉన్న సంపదను తీసుకువెళ్లారు. జరిగిన ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!