Nellore: మీ వాహనానికి కుక్క అడ్డుగా రావడం కామన్.. కానీ పెద్దపులి అడ్డుగా వస్తే.. ఇది సీన్

ప్రయాణాలు చేస్తున్నప్పుడు.. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా కుక్కలు, పిల్లులు, పాములు వంటి రావడం మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ మీ వాహనానికి ఓ పెద్దపులి అడ్డుగా వస్తే..? వామ్మో.. ఊహించుకుంటూనే గుండెల్లో దడగా ఉంది కదూ...? ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఐదుగురు ప్రయాణికులు అలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Nellore: మీ వాహనానికి కుక్క అడ్డుగా రావడం కామన్.. కానీ పెద్దపులి అడ్డుగా వస్తే.. ఇది సీన్
Tiger Hits Car
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:51 PM

శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబై హైవేపై వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్యాసింజర్స్ కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు ప్రయాణిస్తున్నారు. కదిరినాయుడుపల్లె ఫారెస్ట్ ఏరియాలో పెద్దపులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. కారు వేగంగా వస్తుండటంతో పులిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్‌ శ్రీనివాసులు అలెర్టై సడన్ బ్రేక్ వేశాడు. కారు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో పెద్దపులి కాళ్లకు తీవ్రగాయాలయినట్లు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది పులి.

ఊహించని ఈ ఘటనతో కారులోని ఐదుగురూ షాక్ తిన్నారు. భయంతో గావు కేకలు పెట్టారు. డోర్లు మొత్తం మూసి ఉండటంతో.. ఎలాంటి హాని వారికి జరగలేదు. ప్రస్తుతం వారంతా సేఫ్‌గానే ఉన్నారు. ఈ ప్రమాదంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు స్పాట్‌కు చేరుకుని వివరాలు అడిగి తెలిసుకున్నారు. పులి పరిస్థితిని తెలుసకునేందుకు ఫారెస్ట్‌లోకి వెళ్లి కూంబింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచారం గురించి తెలియడంతో… మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Latest Articles