Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి ఆఫీసులో బాబుతో పాటు పవన్ ఫోటో కూడా

కూటమి గెలుపులో కీలక పాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్‌‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన.. పలు కీలక మంత్రిత్వశాఖలు కూడా కట్టబెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, అలాగే ఆఫీసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి ఆఫీసులో బాబుతో పాటు పవన్ ఫోటో కూడా
Chandrababu - Pawan Kalyan Photos
Follow us

|

Updated on: Jun 17, 2024 | 2:59 PM

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను.. జగన్‌ను గెలవనిన్వను అని శపథం చేసిన పవన్.. అలుపెరగని పోరాటం చేశారు. ఊరూ, ఉడా వెళ్లి.. ఉద్వేగభరిత ప్రసంగాలతో జనాల ఓట్లు రాబట్టారు. ఫలితంగా ఎన్డీఏ కూటమి 164 సీట్లతో బంపర్ విక్టరీ నమోదు చేసింది.  వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఇంతటి ఘనవిజయం వెనక పవన్ శ్రమ, పట్టుదల, పోరాటానికి విలువనిచ్చిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు కేటాయించారు. అలానే ప్రభుత్వ ఆఫీసుల్లో ఇకపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రుల ఛాంబర్లలోనూ చంద్రబాబు, పవన్‌ ఫొటోలు పెడుతున్నారు. అలానే ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా, ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండాలని చంద్రబాబు ఆదేశించారట.  డిప్యూటీ సీఎం ప్రొటోకాల్‌ విషయంలోనూ మార్పులు చేసింది ఏపీ సర్కారు. ఆయనకు అదనపు భద్రతను కలిపించింది.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చాంబర్‌ కేటాయించారు. సెక్రటేరియట్‌ రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జనసేన మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్‌కు ఇదే అంతస్తులో చాంబర్లు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. పక్క పక్కనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జూన్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్.

ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో నెగ్గిన జనసేన.. చంద్రబాబు క్యాబినెట్‌లో 3 మంత్రి పదవులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు ఇంపార్టెన్స్ ఉన్న శాఖలు ఇవ్వగా.. ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు సైతం ప్రాధాన్య శాఖలు దక్కాయి. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక , పర్యాటకశాఖ మంత్రిగా నియమితులయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..