CM Chandrababu: ’31సార్లు పోలవరాన్ని సందర్శించి.. 72శాతం పనులు పూర్తి చేశా’.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

పోలవరం ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డాయఫ్రం వాల్ ను గత ప్రభుత్వం కాపాడలేక పోయిందన్నారు. పోలవరాన్ని సంక్లిష్టంగా మార్చారన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీలను మార్చేశారన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా జూన్ 17 సోమవారంను పోలవారంగా మార్చారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు.

CM Chandrababu: '31సార్లు పోలవరాన్ని సందర్శించి.. 72శాతం పనులు పూర్తి చేశా'.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Cm Chandrababu
Follow us

|

Updated on: Jun 17, 2024 | 4:25 PM

పోలవరం ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డాయఫ్రం వాల్ ను గత ప్రభుత్వం కాపాడలేక పోయిందన్నారు. పోలవరాన్ని సంక్లిష్టంగా మార్చారన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీలను మార్చేశారన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా జూన్ 17 సోమవారంను పోలవారంగా మార్చారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించిన చంద్రబాబు.. అనేక అంశాలపై వివరాలు సేకరించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్పిల్ వే, కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక పోలవరం ప్రాజెక్టుపై తొలి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గతంలో పోలవరం సందర్శనకు వస్తామంటే అడ్డుకున్నారన్నారు. ప్రాజెక్టును నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు నిర్వీర్యమైపోయిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏడు ముంపు మండలాలను కలిపాం కాబట్టే పోలవరం ప్రాజెక్టు కట్టగలిగామన్నారు. 2014లో ఏపీకి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేకంటే ముందే ఏడు మండలాలను కలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 31సార్లు పోలవరాన్ని సందర్శించానన్నారు. తాను పడ్డ కష్టాన్ని గత ప్రభుత్వం బూడిదలో పోసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 2019 నాటికి పోలవరం పనులను 72శాతం వరకు పూర్తి చేశామన్నారు. గత పాలకులు పోలవరం విషయంలో క్షమించరాని తప్పు చేశారన్నారు.

రాష్ట్రంలో కరువు ఉండకూడదని పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్ళామన్నారు సీఎం చంద్రబాబు. 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలోనే అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దాంతో కాంట్రాక్టర్లు క్యాన్సిల్ చేయడంతో ప్రాజెక్ట్ అటకెక్కిందని గతాన్ని గుర్తు చేశారు. భూ సేకరణకు, కుడి.. ఎడమ కాలవల నిర్మాణాల విషయాల్లో కోర్టులకు వెళ్లడం వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. 1940 లోనే బ్రిటిష్ వారు ఈ ప్రాజెక్టును కన్సీవ్ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటు రాయలసీమకు కూడా గోదావరి నీళ్లు వాడుకోవచ్చన్నారు. పోలవరంలో మేజర్‎గా చూసుకుంటే గోదావరి డైవర్ట్ చేసి స్పిల్ వే ద్వారా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. దీని ద్వారా 99 శాతం వాటర్‎ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. తాము అధికారం కోల్పోయాక వైసీపీ ప్రభుత్వంలో గోదావరికి వరదలు వచ్చాయి. దీని ప్రభావంతో డయాఫ్రమ్ వాల్ 35% దెబ్బతిందని చెప్పారు. రూ 446 కోట్లతో అప్పట్లో డయాఫ్రం వాల్‎ను నిర్మించామన్నారు. అలాంటి డయాఫ్రమ్ వాల్‎ను కాపాడకుండా గత పాలకులు ఇష్టానుసారంగా ప్రాజెక్టుతో ఆడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు డయాఫ్రం వాల్ రిపేరుకు రూ. 447 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఖర్చు చేసి రిపేర్ చేసినా ఇబ్బంది తలెత్తదనే పరిస్థితి కనిపించడంలేదన్నారు. తిరిగి మొత్తం డయాఫ్రం వాల్ పునఃర్నిర్మించాలంటే రూ. 990 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..