YS Jagan: జగన్‌ ఇంటి వద్ద భారీగా ప్రవేట్ సెక్యూరిటీ.. ఎంతమంది అంటే..?

తాడేపల్లి తలుపులు తెరుచుకున్నాయి. మూడంచెల భద్రతకు బై బై చెప్పింది ప్రభుత్వం. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి మార్గం తెరచుకోవడంతో.. తాడేపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు. మరోవైపు.. తన ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు జగన్.

YS Jagan: జగన్‌ ఇంటి వద్ద భారీగా ప్రవేట్ సెక్యూరిటీ.. ఎంతమంది అంటే..?
Jagan Private Security
Follow us

|

Updated on: Jun 17, 2024 | 4:22 PM

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా ఉపయోగించుకోవడంతో ఇక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడం.. ఎన్డీఏ సర్కార్ ఏర్పడటంతో.. తాడేపల్లి జగన్‌ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. దీంతో.. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఇన్నిరోజులు ఆంక్షలు ఉండటంతో.. ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు స్థానిక ప్రజలు. ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు సడలించడటంతో.. జగన్ ఇంటి ముందు నుంచే ప్రయాణాలు సాగిస్తున్నారు.

2019 నుంచి మొన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లి నుంచి అన్ని కార్యక్రమాలు సాగించారు. పార్టీ పరంగా రివ్యూలు, కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల వ్యూహాలు కూడా ఇదే ఇంటి నుంచి రచించారు. కానీ.. ఎన్నికల్లో ఘోరంగా ఓడటం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. జగన్ ఇంటి దగ్గర భద్రతను భారీగా తగ్గించారు. సాధారణ సెక్యూరిటీని మాత్రమే ఉంచారు.

ప్రభుత్వం భద్రతను తగ్గించడం, ఆంక్షలు సండలించడటంతో.. ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు మాజీ సీఎం జగన్. మాజీమంత్రులు, వైసీపీ నాయకులు, కార్యాలయాల మీద దాడులు జరుగుతుండటంతో.. తాడేపల్లి నివాసం, క్యాంప్ ఆఫీస్‌ దగ్గర 30మంది సెక్యూరిటీని నియమించారు. జగన్ ఇంటి ముందు కొంతమంది, ఇంటి లోపల మరికొంతమంది సెక్యూరిటీగా ఉంటారు. 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే.. జగన్ ఇంట్లోకి పంపారు. వీరంతా ప్రతిరోజు జగన్ ఇంటి దగ్గర కాపలాగా ఉండనున్నారు.

ఇక తమ అధినేత ఇంటి దగ్గర ఆంక్షలు తొలగిపోవడంతో.. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తాడేపల్లి నివాసానికి భారీగా వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు పార్టీ ముఖ్యనేతలు తప్ప.. ఎవ్వరికీ నేరుగా ఎంట్రీ ఉండేది కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు అంతా అపాయింట్‌మెంట్ ఉంటేనే ఇక్కడికి రావాల్సి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మరోవైపు మాజీ సీఎం ఇంటి దగ్గర భద్రతను తొలగించడం కరెక్ట్ కాదంటున్నారు వైసీపీ నాయకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..