AP News: వైసీపీని వీడిన మరో సీనియర్ నేత.. అసలు కారణం ఇదేనట..

వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‎కు పంపారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు టీడీపీలో చేరేందుకు సిద్దమవుతుంటే మరికొందరు ఇంకా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. అయితే తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీని వీడుతున్నట్లు లేఖలో ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.

YSRCP
Follow us

|

Updated on: Jun 17, 2024 | 6:38 PM

2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అప్పటి అధికార టీడీపీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రకాశం జిల్లాలో మంచి పేరున్న నేతగా, పైగా మైనింగ్ వ్యాపారాలు ఉండటంతో చాలా మందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. శిద్దా రాఘవరావుకు అటవీ శాఖతో పాటు పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో కొంతకాలం అక్కడే కొనసాగి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు టికెట్ ఆశించారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఆయన ఎన్డీయే కూటమి హవాలో కూడా విజయం సాధించారు. దీంతో శిద్దా కుటుంబం వైసీపీతో కాస్త దూరం కొనసాగిస్తూ వస్తోంది. తాజగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారాయి. దీంతో తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీని వీడుతున్నట్లు జూన్ 17న ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్

ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..

ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..

ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!

సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో

పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..

ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..

శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!

సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!

అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు

పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??