AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత సంచలన కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సంచలన కామెంట్ చేశారు. అమెజాన్‎లో కర్రీ లీవ్స్ పేరుతో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్నారని అరోపించారు. గంజాయి విక్రయంపై పోలీసు ఉన్నతాధికారి నుంచి తనకు సమాచారం అందిందన్నారు. తక్షణం వాటిని నియంత్రిస్తామని తెలిపారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. ఈరోజు విశాఖలో పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి గంజాయి సరఫరా నియంత్రణపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత సంచలన కామెంట్స్..
Home Minister Anita
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 17, 2024 | 7:03 PM

Share

ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సంచలన కామెంట్ చేశారు. అమెజాన్‎లో కర్రీ లీవ్స్ పేరుతో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్నారని అరోపించారు. గంజాయి విక్రయంపై పోలీసు ఉన్నతాధికారి నుంచి తనకు సమాచారం అందిందన్నారు. తక్షణం వాటిని నియంత్రిస్తామని తెలిపారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. ఈరోజు విశాఖలో పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి గంజాయి సరఫరా నియంత్రణపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏజెన్సీ జిల్లాల్లో గతంలో పనిచేసిన కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్‎లను కూడా పిలిపించారు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన గంజాయిని అరికట్టేందుకు.. తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఆమె అధికారులు కోరారు. గంజాయిపై ఉక్కు పాదం మోపుతానని అందుకు అందరి సహకారం కావాలని కోరారు. ముఖ్యంగా విశాఖలో చాలా ప్రాంతాల్లో చీకటి పెడితే చాలు యువకులు గంజాయి తాగుతూ ఆ మత్తులో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. గాంజా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు నేటి నుంచి ఆలోచనలు విరమించుకోండని హెచ్చరించారు.

ఆంధ్ర ప్రదేశ్ గాంజా హబ్‎గా మారిపోయిందనీ, దీనిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నేటి నుంచే రాత్రి వేళల్లో గుంపులుగుంపులుగా ఉన్న వాళ్ళను విచారించాలని ఆదేశించారు. విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చారన్నారు. గంజాయి కేసులో రాష్ట్ర వ్యాప్తంగా 385 కేసులు నమోదైతే ఒక్క వైజాగ్ నుంచే 1252 మంది పట్టుబడినట్లు తెలిపారు. వీరందరూ జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలో గత ప్రభుత్వం ఒక్కసారి కూడా గంజాయిపై సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. గంజాయిని కంట్రోల్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి నిర్మూలన, ఉమెన్ ప్రొటెక్షన్, భూకబ్జాల నివారణ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గంజాయి పండించే వారికి భయం క్రియేట్ కావాలి.. అదే క్రమంలో వారికి జీవనోపాధి కల్పించాలి కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. ఏపీలో దిశ యాక్ట్ లేదు.. దిశ పోలీస్ స్టేషన్‌లు లేవన్నారు. దిశ పోలీస్ స్టేషన్‎లను మహిళా పోలీసు స్టేషన్‎లుగా మారుస్తా అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై హోం మంత్రి స్పందించారు. దాడులు జరుగుతున్నాయో, దాడులు స్వయంగా చేసుకుంటున్నారో విచారణ జరిపిస్తామన్నారు. తమ పార్టీవారు తప్పు చేసినా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే తమ కార్యకర్తలు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇళ్లకు పరిమితమయ్యారని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..