Mudragada: జనసేనానికి ముద్రగడ ఓపెన్ ఛాలెంజ్.. పిఠాపురంలో తనపై పోటీకి రావాలని పవన్‌కు పిలుపు
కాకినాడ ఎమ్మెల్యేతో పాటు నన్ను కూడా తిట్టడం మీ దృష్టిలో తప్పో రైటో గ్రహించాలన్నారు. నన్ను మీరు తిట్టడం వల్లే సమాధానంగా లేఖ రాశాను.. మీరు అభిమానుల చేత బండబూతులతో మెసేజ్లు పెట్టిస్తున్నారు. మీ అభిమానులు పెట్టే మెసేజ్ లకి నేను భయపడి పోయి నేను లొంగి పోతాను అనుకుంటున్నారేమో అలా ఈ జన్మకు జరగదని చెప్పారు మాజీ ఎంపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం. మీరు సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం సోషల్ మీడియా వేదికగా మరో లేఖను రాశారు. మూడు పేజీల లేఖలో అనేక అంశాలను ప్రస్తావిస్తూనే జనసేనానికి ముద్రగడ పద్మనాభం ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే పిఠాపురంలో తనపై పోటీచేయ్ అని ముద్రగడ సవాల్ విసిరారు. కాకినాడ ఎమ్మెల్యేతో పాటు నన్ను కూడా తిట్టడం మీ దృష్టిలో తప్పో రైటో గ్రహించాలన్నారు. నన్ను మీరు తిట్టడం వల్లే సమాధానంగా లేఖ రాశాను.. మీరు అభిమానుల చేత బండబూతులతో మెసేజ్లు పెట్టిస్తున్నారు.
మీ అభిమానులు పెట్టే మెసేజ్ లకి నేను భయపడి పోయి నేను లొంగి పోతాను అనుకుంటున్నారేమో అలా ఈ జన్మకు జరగదని చెప్పారు. మీరు సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నేను మీ దగ్గర నౌకరీ చేయడం లేదు.. నేను నా సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయవద్దా అసలు.. నాకు మీకు ఉన్న సంబంధం ఏమిటి.. మీకు డబ్బు ఉంది కనుక నన్ను మీ అభిమానులతో తిట్టిస్తారా అంటూ ప్రశ్నించారు.
అప్పట్లో వంగవీటి రంగా ను హత్య చేసిన సమయంలో ఎంతో మంచి అమాయకులు జైల్లో ఉన్నారని.. అప్పుడు మీరు జైలుకు వెళ్లి ఎవరినైనా పలకరించారా.. 2016 లో తుని సభ తరువాత కేసులో ఉన్నవారిని ఎప్పుడైనా పలకరించారా అంటూ పవన్ ను ప్రశ్నించారు ముద్రగడ.
తుని ఘటనలో ఉన్న కేసులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసివేసిన సంగతి మీకు తెలుసా అన్నారు. స్వార్ధపరుడినని.. కులం కోసం ఏమీ చేయలేదంటూ సినిమా డైలాగ్స్ చెబుతున్నారు.. నన్ను గోచీ, మొలత్రాడు లేని వాళ్లతో తిట్టించడం మొగతనం కాదు.. దమ్ము దైర్యం ఉంటే మీరు తిట్టండి అంటూ పవన్ కు ఓపెన్ ఛాలెంజ్ ను విసిరారు. అప్పడూ నేను సమాధానం చెబుతాను కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడి.. ఎప్పుడైనా కాపుల గురించి మీరు ఆలోచించారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం. కోనసీమ జిల్లా పేరు విషయంలో అమాయకులపై కేసులను పెట్టిన సమయంలో మీరు ఎందుకు స్పందించలేదు.. నిత్యం మిమ్మలను స్మరించే కోనసీమకు ఎందుకు వెళ్లలేదన్నారు.. అరెస్ట్ అయిన వారి ని రిలీజ్ చేయించడానికి బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదన్నారు.
మీకోసం మాత్రమే మీ అభిమానులు రోడ్డు మీదకు రావాలి.. ఎవరికైనా ఆపద వస్తే మాత్రం మీరు చేతనైన సాయం కూడా చేయరు అంటూ ఆరోపించారు. అయినా నాకు ద్వారంపూడి కుటుంబం తో తనకున్న అనుభంతో ఇప్పటిది కాదు.. మీ కోసం నేను ఆ కుటుంబాన్ని దూరం చేసుకోను.. మీ అభిమానులతో తిట్టేస్తే భయపడతానని భావించవద్దు అంటూ పవన్ కళ్యాణ్ కు సూచించారు ముద్రగడ పద్మనాభం. మరి ఇప్పటికే ముద్రగడ లేఖ కాకరేపుతుండగా.. తాజాగా లేఖపై ఓపెన్ ఛాలెంజ్ పై జనసేన అధినేత, జనసేన శ్రేణులు, కాపు నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..