Konaseema: కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ONGC గ్యాస్‌లీక్
కోనసీమ జిల్లాలో ONGC పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడం తీవ్ర కలకలం రేపింది. మలికిపురం మండలం ఇరుసమండ సమీపంలో గ్యాస్ లీక్‌తో పాటు మంటలు ఎగసిపడటంతో గ్రామం అంతా పొగమయంగా మారింది. ముందు జాగ్రత్తగా అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

కోనసీమ జిల్లాలో ONGC పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ సమీపంలో భారీగా గ్యాస్ లీక్‌లో సమీప గ్రామం అంతా పొగ అలుముకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనపై ONGC అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.
మంటల ధాటికి వందల కొబ్బరి చెట్లు తగలబడుతున్నాయి. అధికారుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నారు ONGL సిబ్బంది. ఓ ప్రైవేట్ సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు.
గ్యాస్ ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరో వైపు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో జాగ్రత్తలు చెబుతూ అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు.
