Andhra Pradesh: ఎంపీ వంగా గీతకు నిరసన సెగ.. సెల్ టవరెక్కి వ్యక్తి హల్‌చల్.. పట్టించుకోకుండా వెళ్లిన వైనం
ఆసరా చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఓ వ్యక్తి ఎంపీ, ఎమ్మెల్యేల ఎదురుగానే సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయండంటూ ఆందోళన తెలిపాడు..
ఆసరా చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఓ వ్యక్తి ఎంపీ, ఎమ్మెల్యేల ఎదురుగానే సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయండంటూ ఆందోళన తెలిపాడు. సభాస్థలానికి చేరువలో ఉన్న సెల్ టవర్ పైకి కరాటి శ్రీను అనే వ్యక్తి ఎక్కి తనకు న్యాయం చేయండంటూ ఆందోళన చేశాడు. రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీలు వేయటానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ దుకాణాన్ని కూల్చివేశారు అంటూ ఆ షాపు యజమానైన కరాటి శ్రీను వాపోయాడు. తనకు న్యాయం జరగకుంటే కిందికి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు.
సమాచారం అందుకున్న ప్రత్తిపాడు సీఐఐ కిషోర్ బాబు, ఇతర పోలీస్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో సీఐ కిషోర్ బాబు సెల్ టవర్ పైకి ఎక్కే ప్రయత్నం చేయడంతో బాధితుడు దూకేయడానికి ప్రయత్నించాడు. ఇంత జరుగుతున్నా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఏమాత్రం పట్టించుకోకుండా సభా వేదిక నుంచి వెళ్లిపోవడం కొసమెరుపు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.